స్టార్ హీరో కూతురుకు అలాంటి వ్యాధి.. తండ్రి వల్లే ఆ సమస్య.. ఐదేళ్లుగా పోరాటమంటూ!

హిందీ చిత్ర పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నటనలో పూర్తి పర్ఫెక్షనిస్టుగా పాపులర్ అయిన అమీర్ ఖాన్ అప్పుడప్పుడు పలు వివాదాల్లో కూడా నిలిచాడు.

ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ఓటమి చవిచూశాడు. ఇక అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేది. తాజాగా ఐరా ఖాన్ తనకున్న వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Aamir Khan Daughter Ira Khan About Her Mental Disorder For Few Years

సినిమాల్లోకి: బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాకు రెండో సంతానం అయినా ఐరా ఖాన్ ముందుగా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఐరా ఫిలీం ప్రొడక్షన్ లోకి కూడా రానున్నట్లు, నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్లు మరో టాక్ వినిపించింది.

Aamir Khan Daughter Ira Khan About Her Mental Disorder For Few Years

ప్రియుడితో ఫొటోలు: నిర్మాతగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఐరా ఖాన్ అడుగు పెడుతుందన్న వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అంతేకాకుండా ఐరా ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలు, అతనితో సన్నిహితంగా ఉండే పిక్స్ ను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోల కోసం వెతికేవారు.

Aamir Khan Daughter Ira Khan About Her Mental Disorder For Few Years

ఘనంగా నిశ్చితార్థం: సెలబ్రిటీస్ ఫిట్ నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శికరేతో ఐరా ఖాన్ గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తుంది. ఆ మధ్య ఐరాకు నుపుర్ శిఖరే రింగ్ తొడిగి మరి ప్రపోజ్ చేయగా.. గతేడాది నవంబర్ 18న వీరిద్దరికి ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వేడుకలకు అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు.

Aamir Khan Daughter Ira Khan About Her Mental Disorder For Few Years

విడాకుల తర్వాత: ఇదిలా ఉంటే ఐరా ఖాన్ తాజాగా మెంటల్ హెల్త్ సపోర్ట్ అందించే అగత్సు ఫౌండేషన్ (Agatsu Mental Support Foundation)ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐరా ఖాన్ తనకున్న వ్యాధి గురించి తెలిపింది. "నేను ఐదేళ్లుగా మెంటల్ డిజార్డర్ తో బాధపడుతున్నాను. నా తండ్రి అమీర్ ఖాన్, రీనా దత్తా విడాకుల తర్వాత డిప్రెషన్ లో కి వెళ్లిపోయా" అని ఐరా ఖాన్ పేర్కొంది.

ఏం తినకుండా: ఐరా ఖాన్ ఇంకా కొనసాగిస్తూ.. "నా కుటుంబంలోనే మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా 8-10 నెలలకు ఒకసారి మానసికంగా కుంగిపోతున్నా. అలా ఏడుస్తూనే ఉంటాను. బాధగా ఉండిపోతాను. ఒక్కోసారి నాలుగైదు రోజులు తినకుండా ఉండిపోతాను. కానీ మా నాన్న సపోర్టుతో డిప్రెషన్ నుంచి బయటపడగలిగాను" అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X