twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. మరో అమ్మాయితో కలిసి అలా.. టూ హాట్ గురూ.!

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. తన విలక్షణ నటనతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారాయన. సినిమా కోసం అమీర్ ఖాన్‌ ఎంతో కష్టపడుతుంటారు. అందుకే ఆయన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొద్దిరోజులుగా అమీర్ నుంచి ఆయన కూతురు హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఆమె వ్యవహరిస్తున్న తీరే.

    ప్రేమాయణంతో ఫేమస్

    ప్రేమాయణంతో ఫేమస్

    ఇరా ఖాన్ కొంతకాలంగా మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపాలానితో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఆమె తరచూ అతడితో ఎక్కడో దగ్గర చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతోంది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం బలపడిందని బీ టౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.

    డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటన

    డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటన

    కొద్దిరోజుల క్రితం తాను మిషాల్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పేసింది ఇరా. తనతో కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నానని వెల్లడించింది. దీంతో వీళ్ల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇక, అప్పటి నుంచి ఇరా ఖాన్ - మిషాల్ అస్సలు తగ్గడం లేదు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం చేస్తున్నారు.

    హగ్ చేసుకున్న ఫొటో

    హగ్ చేసుకున్న ఫొటో

    ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అతడిని కౌగిలించుకుని ఉన్న ఫొటోను ఇరా ఖాన్ షేర్ చేసింది. అంతేకాదు, ‘‘మీ ఆశ్చర్యాన్ని అన్ని చోట్లా వ్యాప్తి చేసుకోండి. ఇందుకోసం అవసరమైతే నా సోషల్ మీడియా స్కిల్స్‌ను వాడుకోండి. ఇంక వెనుదిరిగి చూడకండి. మీ స్పందన కోసం ఇక్కడే వేచి చూస్తాను'' అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చింది. ఇది చూసిన వారంతా ఇరా ఖాన్ ధైర్యానికి నోరెళ్లబెడుతున్నారు.

    ఇప్పుడేమో హాట్ ఫొటోతో రచ్చ

    తాజాగా ఇరా ఖాన్ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా హాట్‌గా కనిపిస్తోంది. మరో అమ్మాయి సోఫాలో కూర్చుని ఉండగా, ఆమె పక్కన (పైన) ఇరా కూర్చుంది. దీంతో కింద ఉన్న అమ్మాయి ఇరా తొడలను పట్టుకుని ఉంది. ఈ ఫొటో ఇంత హాట్‌గా ఉండడంతో బీ టౌన్‌లో చర్చనీయాంశం అయింది.

    సోషల్ మీడియాలో ట్రోల్స్

    సోషల్ మీడియాలో ట్రోల్స్

    ఇరా ఖాన్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు సెక్సీగా ఉన్నావు అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఇంకొందరైతే నువ్వు బుర్ఖా వేసుకోవాలి అని ఆమెను డిమాండ్ చేస్తున్నారు.

    English summary
    Dangal Fame Aamir Khan's Daughter Ira Khan Share Her boy Friend Photo In Instagram. This Pic was Hot topic In bollywood. This isn't the first time Ira has posted a picture with Mishaal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X