Aamir Khan కూతురు అతనితో లవ్ ట్రాక్.. పబ్లిక్ లో ముద్దులతో ప్రపోజ్!

ఇటీవల కాలంలో సెలబ్రిటీ వారసులు కొంతమంది సినిమాలతో హైలైట్ గా నిలుస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఇతర రంగాల్లో స్థిరపడుతూ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక మరికొందరు ఊహించని విధంగా లవ్ ట్రాక్స్ తో కూడా మీడియాలో వైరల్ గా మారుతున్నారు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా తన ప్రియుడితో కలిసిన ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హైలెట్ అవుతోంది. ఇక రీసెంట్ గానే అందరూ చూస్తుండగానే బాయ్ ఫ్రెండ్ కు ముద్దు కూడా పెట్టింది. ఇక వారికి సంబంధించిన ప్రపోజల్ వీడియో కూడా వైరల్ గా మారింది ఆ వివరాల్లోకి వెళితే..

మొదట హీరోయిన్ గా..

మొదట హీరోయిన్ గా..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆమెకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు అని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. అనంతరం ఆమె ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా రాబోతున్నట్లు నిర్మాతగా కూడా కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్లు మరో టాక్ వినిపించింది.

బాయ్ ఫ్రెండ్ తో లవ్

బాయ్ ఫ్రెండ్ తో లవ్

ఇక ఇరా ఖాన్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేసుకుంటూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గానే ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరేను ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది.

అందరిముందు ముద్దులు

అందరిముందు ముద్దులు

ఇక ఇటీవల వీరికి సంబంధించిన ఒక ప్రపోజల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. అందులో ఇరా ఖాన్ ప్రత్యేకంగా ప్రియుడిని ముద్దు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వీడియోలో నూపూర్ ఇరా వైపు నడుస్తూ, మోకాళ్లపై తన చేతిలో ఉంగరంతో రొమాంటిక్ గా ప్రపోజ్ అయితే చేశాడు. అందుకు ఆమె ఎస్ కూడా చెప్పింది.

అప్పటి నుంచి ప్రేమలో

అప్పటి నుంచి ప్రేమలో

ఇరా, నూపూర్ 2020 నుంచి ప్రేమలో కొనసాగుతున్నారు. అతను ఫిట్నెస్ ట్రైనర్ గా పరిచయమవ్వగా కొన్నాళ్ళకు ఇరా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా, ఇరా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకుని, నుపూర్‌తో తన సంబంధాన్ని కూడా ప్రకటించింది. ఇక బయట ఇతర పుకార్లు వైరల్ కాకముందుకే ఆమె ఆ విధంగా క్లారిటీ ఇవ్వడంతో అప్పటినుంచి కూడా ఈరా తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంది.

త్వరలోనే పెళ్లి


నూపుర్‌ విషయానికి వస్థే అతను పూణేకి చెందిన వ్యక్తి. కామర్స్, ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అతను రాష్ట్ర స్థాయి టెన్నిస్ ఆటగాడు. ఆ తరువాత సెలబ్రెటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారాడు. ఇక ఇరా తండ్రి అమీర్ ఖాన్‌కు అప్పట్లో శిక్షణ కూడా ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఇరాకు పరిచయమైన అతను కొన్ని రోజుల్లోనే లవ్ ట్రాక్ లోకి ఎక్కేశాడు. ఇక త్వరలోనే అతను ఆమిర్ ఖాన్ కు అల్లుడు కాబోతున్నాడు. వీరి పెళ్లికి త్వరలోనే ముహూర్తం సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X