మరోసారి లవర్‌తో కలిసున్న ఫొటోను షేర్ చేసిన స్టార్ హీరో కూతురు

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన విలక్షణ నటనతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారాయన. సినిమా కోసం అమీర్ ఖాన్‌ ఎంతో కష్టపడుతుంటారు. అందుకే ఆయన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అయితే, ఈ మధ్య కూతురు ఇరా ఖాన్ వల్ల కొంత టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

దీనికి కారణం.. ఆమె ఈ మధ్య ప్రవర్తిస్తున్న తీరే. ఆమె కొంతకాలంగా మ్యూజిక్ కంపోజర్ అయిన మిషాల్ కృపాలానితో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఆమె తరచూ అతడితో ఎక్కడో దగ్గర చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతోంది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం బలపడిందని బీ టౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరా ఖాన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Aamir Khan Daughter Ira Khan Share Her boy Friend Photo


గత నెలలో తాను మిషాల్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పేసింది ఇరా. తనతో కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నానని వెల్లడించింది. దీంతో వీళ్ల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇక, అప్పటి నుంచి ఇరా ఖాన్ - మిషాల్ అస్సలు తగ్గడం లేదు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె ఓ ఫొటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అతడిని కౌగిలించుకుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, ''మీ ఆశ్చర్యాన్ని అన్ని చోట్లా వ్యాప్తి చేసుకోండి. ఇందుకోసం అవసరమైతే నా సోషల్ మీడియా స్కిల్స్‌ను వాడుకోండి. ఇంక వెనుదిరిగి చూడకండి. మీ స్పందన కోసం ఇక్కడే వేచి చూస్తాను'' అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చింది. ఇది చూసిన వారంతా ఇరా ఖాన్ ధైర్యానికి నోరెళ్లబెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X