బుర్ఖా వేసుకో బేబీ.. స్టార్ హీరో కూతురు నిర్వాకంపై నెటిజన్ల మండిపాటు

By Manoj

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. తన విలక్షణ నటనతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారాయన. సినిమా కోసం అమీర్ ఖాన్‌ ఎంతో కష్టపడుతుంటారు. అందుకే ఆయన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. ఆయన కూతురు కూడా అంతే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. దీనికి కారణం ఆమె వ్యవహరిస్తున్న తీరే. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

ప్రేమాయణంతో ఫేమస్

ప్రేమాయణంతో ఫేమస్

ఇరా ఖాన్ మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపాలానితో ప్రేమాయణం సాగిస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి బలం చేకూర్చేలా ఆమె తరచూ అతడితో ఎక్కడో దగ్గర చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతూ ఉండేది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం బలపడిందని బీ టౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి.

డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటన

డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటన

కొద్దిరోజుల క్రితం తాను మిషాల్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పేసింది ఇరా. తనతో కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నానని వెల్లడించింది. దీంతో వీళ్ల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇక, అప్పటి నుంచి ఇరా ఖాన్ - మిషాల్ అస్సలు తగ్గడం లేదు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్

ఇరా ఖాన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నిరంతరం సామాజిక మాధ్యమాల్లో బిజీ బిజీగా గడిపే ఆమె.. తన అందాలతో కనువిందు చేస్తోంది. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

ఇప్పుడు మరింత రెచ్చిపోయింది

తాజాగా ఇరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన స్కిన్ షో మామూలుగా లేదు. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. దీంతో ఇవి తక్కువ వ్యవధిలోనే వైరల్ అయిపోయాయి.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
సోషల్ మీడియాలో ట్రోల్స్

సోషల్ మీడియాలో ట్రోల్స్

ఇరా ఖాన్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు సెక్సీగా ఉన్నావు అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఇంకొందరైతే నువ్వు బుర్ఖా వేసుకోవాలి అని ఆమెను డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ అభిమానులు ఆమె తీరును తప్పుబడుతున్నారు. అయితే నెటిజన్ల తీరును విమర్శిస్తూ దిమ్మతిరిగే సమాధానం ఇవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X