Suhani Bhatnagar సుహానీ మృతితో అమీర్ ఖాన్ కంటతడి.. నా హృదయంలో అంటూ భావోద్వేగం

దంగల్ సినిమాలో బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్ ఇకలేరు. మెడిసిన్ రియాక్షన్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మరణ వార్తతో సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సుహానీ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తనతో నటించిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే వార్తతో అమీర్ ఖాన్ తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు..సుహాని మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో సినీ ప్రేక్షకులకు సుహానీ భట్నాగర్ పరిచయం అయ్యారు. బబితా ఫోగట్‌గా ఆమె నటించిన తీరు చూసి సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు గుప్పించారు. యాక్టర్‌గా స్థిరపడుతారని అందరూ ఆశించారు. కానీ విధి మరోలా తలిచింది.

Aamir Khan Emotional and tear filled Condolances to Suhani Bhatnagar

సుహానీ భట్నాగర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురై కాలికి గాయమైంది. దాంతో ఆమె చిక్సిత అనంతరం మెడిసిన్ వాడుతున్నారు. మెడిసిన్ రియాక్షన్ కావడంతో శరీర కణాల్లో ఫ్లూయిడ్స్ పెరిగిపోయాయి. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించింది. దాంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Aamir Khan Emotional and tear filled Condolances to Suhani Bhatnagar

సుహానీ భట్నాగర్ ఆకస్మిక మరణంతో అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మృతికి సంతాపం తెలియచేస్తూ కంటతడి పెట్టుకొన్నారు. సుహానీ భగ్నాగర్ ఇకలేరనే విషయంతో విషాదంలో మునిగిపోయాను. ఆమె తల్లి పూజా భట్నాగర్‌కు నా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అమీర్ ఖాన్ అన్నారు.

Aamir Khan Emotional and tear filled Condolances to Suhani Bhatnagar

సుహానీ అత్యంత ప్రతిభ కలిగిన అమ్మాయి. ఆ అమ్మాయిలేకపోతే దంగల్ సినిమా అసంపూర్ణంగా ఉండేది. ఆమె ఎప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని అమీర్ ఖాన్ తన ప్రకటనలో తెలిపారు. సుహనీ మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసింది అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X