ఆ సమయంలో చాలా కుంగిపోయా.. మద్యానికి బానిసయ్యా..! స్టార్ హీరో ఎమోషనల్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన కెరీర్ లో భారీ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం కూడా టాప్ హీరోల జాబితాలో నిలిచారు. అయితే బయటకు ఎంతో స్ట్రాంగ్‌గా కనిపించే ఈ స్టార్ హీరో జీవితంలోనూ ఒకప్పుడు తీవ్రమైన భావోద్వేగ తుఫాను వీచింది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన అతన్ని పూర్తిగా కుదిపేసిందట. ఆ బాధను తట్టుకోలేక మానసికంగా విరిగిపోయిన ఆయన, కొంతకాలం మద్యానికి కూడా బానిసయ్యాడు. తాజాగా ఆ కఠిన దశను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అసలేం జరిగింది?

ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్‌లో 'మిస్టర్ పర్ఫెక్ట్'గా పేరుగాంచిన అమీర్ ఖాన్ (Aamir Khan). ఈ స్టార్ హీరో తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ముఖ్యంగా తన మొదటి భార్య రీనా దత్తా (Reena Dutta)తో విడిపోవడం తన జీవితాన్ని పూర్తిగా కుదిపేసిందని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. 'రీనా పిల్లలతో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోయిన రోజు నా జీవితంలోనే అత్యంత విషాదమైన రోజు. నేను పూర్తిగా ఒంటరిగా మారిపోయాను. ఆ బాధను తట్టుకోలేక మద్యం వైపు వెళ్లాను' అని అన్నారు. అంతకుముందు అసలు మద్యం తాగని వ్యక్తినైన తాను, ఒక్కసారిగా మద్యానికి బానిసయ్యానని చెప్పాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రతి రాత్రి ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని' అంటు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Aamir Khan Emotional Turned to Alcohol After Reena Dutta Divorce Shares Painful Life Phase

ఆ సమయంలో తాను మానసికంగా ఎంతగా విరిగిపోయానో గుర్తుచేసుకుంటూ.. 'అది నాకు పూర్తిగా చీకటి దశ. నేను నన్నే కోల్పోయినట్లు అనిపించింది. బాధను మర్చిపోవడానికి మద్యం మాత్రమే మార్గమని అనుకున్నాను' అని చెప్పారు. ఇండస్ట్రీలో చాలా డిప్రెషన్‌ను ఎదుర్కొంటారని, కొందరు ఆ ఒత్తిడిని తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. అయితే అమీర్ ఖాన్ జీవితంలో టర్నింగ్ పాయింట్ కూడా అదే సమయంలో వచ్చిందని ఆయన చెప్పారు. 'నేను ఇలా కొనసాగితే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది?' అనే ప్రశ్న తనను మేల్కొలిపిందని చెప్పారు. తన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ కోసం నిలబడాలని నిర్ణయించుకున్నానని, ఆ క్షణం నుంచే మద్యాన్ని పూర్తిగా వదిలేశానని, ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ ఆ అలవాటుకు దగ్గర కాలేదని స్పష్టం చేశారు.

అమీర్ ఖాన్-రీనా దత్తా ప్రేమకథ కూడా ప్రత్యేకమే. పొరుగువారిగా ప్రారంభమైన పరిచయం ప్రేమగా మారి, 1986లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 సంవత్సరాల పాటు కలిసి జీవించిన ఈ జంట 2002లో విడాకులు తీసుకున్నారు. ఈ విడిపోవడం తమ కుటుంబాలకు కూడా తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన గతంలో కాఫీ విత్ కరణ్ (Koffee with Karan) షోలో వెల్లడించారు. అయితే విడిపోయిన తర్వాత కూడా ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గలేదని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.

రీనాతో విడాకుల అనంతరం, అమీర్ ఖాన్ దర్శకురాలు కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఈ జంట కూడా 2021లో విడిపోయింది. ప్రస్తుతం తమ కుమారుడిని కలిసి పెంచుతున్నారు. ఇక ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేయడం కూడా వార్తల్లో నిలిచింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. లాల్ సింగ్ చద్దా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అమీర్, సితారే జమీన్ పార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్‌లో చిన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తన నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ దిన్' సినిమాపై దృష్టి పెట్టారు. ఈ సినమాలో తన కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానున్నది.

Read more about: aamir khan reena dutta bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X