Sandeep Reddy Vanga మగాళ్లు మీరు తేల్చుకోండి.. యానిమల్ డైరెక్టర్‌కు అమీర్ ఖాన్ మాజీ భార్య కౌంటర్
బాలీవుడ్ ప్రముఖులతో యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గొడవ గట్టిగానే కొనసాగుతున్నది. జావెద్ అఖ్తర్, అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావుతో వాదన ఆసక్తికరంగా మారింది. తన సినిమాల్లో మహిళలను కించపరిచే, తప్పుడు రితీలో సన్నివేశాలను తీస్తారంటూ సందీప్ రెడ్డిపై ఇటీవల ఘాటుగా స్పందించారు. వారి కామెంట్లపై తాజా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు. ఆ విషయంపై కిరణ్ రావు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. ఈ గొడవకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డిపై జావెద్ అఖ్తర్ అనుచితంగా కామెంట్స్ చేశారు. మహిళలను టార్గెట్ చేస్తూ, దూషిస్తూ.. వారి మనోభావాలను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారంటూ జావెద్ కామెంట్స్ చేశారు. ఆయన మాటలకు ధీటుగా సమాధానం ఇస్తూ.. మీ కుమారుడు తీసిన మీర్జాపూర్‌లో ఎన్ని బూతులు ఉన్నాయో.. ఆడవాళ్లను ఎలా చూపించారో ముందు ఆ విషయం గురించి మాట్లాడండి అంటూ సందీప్ రెడ్డి వంగ సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాల్లో మహిళలను దారుణంగా చూపించారు అంటూ కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలకు కూడా సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందించారు. మీ ఆయన అమీర్ ఖాన్.. ఓ సినిమాలో హీరోయిన్‌ను రేప్ చేసినంత పనిచేశాడు. ఆ విషయం మీకు కనిపించదా? గట్టిగా సమాధానం ఇచ్చాడు.
అయితే సందీప్ రెడ్డి ఇచ్చిన జవాబుపై కిరణ్ రావు స్పందిస్తూ.. నేను యానిమల్ గానీ, అర్జున్ రెడ్డి గురించి కామెంట్ చేయలేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే.. అమీర్ ఖాన్‌తోనే మాట్లాడండి.. ఆయన సినిమాల్లో ఏదైనా తప్పు ఉంటే.. దానికి అతడే బాధ్యుడు. నాకు అమీర్ ఖాన్‌కు సంబంధం ఏమిటి? అని కిరణ్ రావు కామెంట్ చేసింది.

సందీప్ రెడ్డి వంగ సినిమాల గురించి నేను కామెంట్ చేయలేదు. నేను ఆ సినిమాలను చూడలేదు. నేను సినిమాల్లో మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారని గతంలో చాలా వేదికలపై చాలా సార్లు మాట్లాడాను. ఫలానా సినిమాలో జరిగిందంటూ ఎత్తి చూపలేదు. ఇక ముందు కూడా ఇలాంటి విషయాలు ఉంటే మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పారు.
దిల్ సినిమాలో ఓ పాటలో హీరోయిన్‌తో అమీర్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించే విధంగా ఉంటుంది. దానికి ఆయన స్వయంగా క్షమాపణలు చెప్పి తన హుందాతనాన్ని చాటుకొన్నారు. ఒకవేళ అమీర్ ఖాన్‌తో ఏదైనా ఇష్యూ ఉంటే.. మగాళ్లు మీరు మీరు మాట్లాడుకొండి. అమీర్ ఖాన్ వర్క్ విషయంలో నేను బాధ్యురాలిని కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే వారిద్దరి ప్రశ్నించుకోవాలి అని కిరణ్ రావు సమాధానం చెప్పారు.


Click it and Unblock the Notifications











