#మీటూ ఆరోపణలున్న దర్శకుడితో అమీర్ ఖాన్, తనుశ్రీ దత్తా ఆగ్రహం!

బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో తాను సుభాష్ కపూర్‌తో కలిసి 'మొగుల్' అనే చిత్రానికి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కబోతోంది. అయితే అమీర్ ఖాన్ ఈ ప్రకటన చేయగానే నటి తనుశ్రీ దత్తా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు కారణం #మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సుభాష్ కపూర్‌తో ఆయన పని చేయడానికి సిద్ధమవ్వడమే. ఇండియాలో #మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న తనుశ్రీ దత్తా... అమీర్ ఖాన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఎవరూ ముందుకు రావడం లేదు ఎందుకు?

ఎవరూ ముందుకు రావడం లేదు ఎందుకు?

ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో తనూశ్రీ మాట్లాడుతూ "అమీర్ ఖాన్ రాసిన మొత్తం పేరాగ్రాఫ్ చదివాను, సుభాష్ కపూర్‌తో ఎందుకు కలిసి పని చేస్తున్నానో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ... ఒక అమ్మాయి హరాస్మెంటుకు గురై బాధితురాలుగా మారి నిద్రలేని రాత్రులు గడుపుతున్నపుడు ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు? ఆమెను పరిశ్రమ నుంచి బహిష్కరించారా?'' అని వ్యాఖ్యానించారు.

#మీటూ నిందితుల చుట్టూ చాలా కరుణ ఉన్నట్లు అనిపిస్తుంది

#మీటూ నిందితుల చుట్టూ చాలా కరుణ ఉన్నట్లు అనిపిస్తుంది

"#మీటూ నిందితుల చుట్టూ చాలా కరుణ ఉన్నట్లు అనిపిస్తుంది, కాని ఆరోపించిన బాధితుల కోసం ఎవరూ అండగా లేరు. ఎవరూ మా లాంటి బాధితుల గురించి కనీసం పట్టించుకోవడం లేదు. హార్న్ ఓకే ప్లీజ్ వేధింపుల ఎపిసోడ్ తర్వాత నేను అవకాశాలు కూడా కోల్పోయాను." అని తనుశ్రీ దత్తా తెలిపారు.

మా లాంటి వారిపై మీకు కనికరం లేదా? అమీర్ ఖాన్...

మా లాంటి వారిపై మీకు కనికరం లేదా? అమీర్ ఖాన్...

"నేను ఒక టాలెంటెడ్ స్క్రీన్ యాక్టర్. ఎవరూ కనీసం నాకు లేఖలు రాయలేదు, నాతో పని చేయాలని ఎవరూ కనీసం పెద్దవాళ్లను రిక్వెస్ట్ చేయలేదు. ఎన్నో అవమానాలు, వేధింపులు భరించాను. మాకు అండగా నిలిచేవారు ఇక్కడ ఎవరూ లేరు. మా లాంటి వారిపై మీకు కనికరం లేదా? అమీర్ ఖాన్...'' అంటూ తనుశ్రీ దత్తా ప్రశ్నించారు.

గతంలో ఈ దర్శకుడితో వద్దనుకుని, మనసు మార్చుకున్న అమీర్ ఖాన్

గతంలో ఈ దర్శకుడితో వద్దనుకుని, మనసు మార్చుకున్న అమీర్ ఖాన్

వాస్తవానికి అమీర్ ఖాన్ గతంలోనే సుభాస్ కపూర్‌తో ‘మొగుల్' సినిమా చేద్దామనుకున్నారు. అయితే సుభాష్ కపూర్‌పై ఓ నటి #మీటూ ఆరోపణలు చేయడంతో ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్టు అమీర్ ఖాన్ ప్రకటించారు. అమీర్ ఖాన్ ప్రకటన తర్వాత అతడితో పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

అమీర్ ఖాన్ మనసు మార్చుకోవడంతో...

అమీర్ ఖాన్ మనసు మార్చుకోవడంతో...

సుభాష్‌కు మాయావతి బయోపిక్‌తో సహా కొన్ని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. అయితే అమీర్ ఇష్యూ కారణంగా స్టూడియోలు ఆయనకు ఎవరూ ఇవ్వడం లేదు. ఇప్పుడు, అమీర్ ప్రకటనతో, సుభాష్ కెరీర్ ముందుకు సాగడం చాలా సులభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X