Lal Sing Chaddha: దయచేసి నా సినిమాను బాయ్‌కాట్‌ చేయకండి... అమీర్ ఖాన్ ఆవేదన

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఒక నెగిటివ్ టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నటిజన్స్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సినిమాను చూడవద్దు అని బాయ్‌కాట్‌ చేయాలి అని కొన్ని ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అమీర్ ఖాన్ కూడా స్పందించే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ప్రచారాలు

టాలీవుడ్ లో ప్రచారాలు

ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు అందుకున్న ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా విడుదల చేస్తున్నారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అని అమీర్ ఖాన్ కూడా మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే ఇతర ఇండస్ట్రీలో కూడా ప్రచారాలు అయితే చేశారు. అందుకోసం మెగాస్టార్ సాయం కోరుతున్నారు.

బాయ్‌కాట్‌ ట్రెండింగ్

బాయ్‌కాట్‌ ట్రెండింగ్

ఒక విధంగా అమీర్ ఖాన్ నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న సినిమా కూడా కావడంతో ఓవర్గం ప్రేక్షకులు ఈ సినిమాను మొదటి రోజు మొదటిసారి చూసేందుకు కొంత ఆసక్తిని అయితే చూపిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కొన్ని నెగటివ్ ట్యాగ్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. సినిమాను చూడవద్దు అని బాయ్‌కాట్‌ చేయాలి అని పలువురు అమీర్ ఖాన్ పై భిన్నభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

గతంలో చేసిన కామెంట్స్

గతంలో చేసిన కామెంట్స్

అయితే గతంలో 2015లో అమీర్ ఖాన్ ఇండియాలో భద్రత లేదు అంటూ ఇక్కడ నాకు ఉండాలని లేదు అని చెప్పడంతో అందరూ కూడా అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక దేశం పై తప్పుడు అభిప్రాయం వచ్చేలా ఆ విధంగా వివరణ ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని భారతదేశ పౌరుడిగా దేశం మీద నీకు గౌరవం ఉంటే ఆ విధంగా అనవు అని చాలామంది విమర్శలు చేశారు.

ప్రతీ సినిమాకు అలానే..

ప్రతీ సినిమాకు అలానే..

అమీర్ ఖాన్ అలా స్పందించడంతో అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక ప్రతి సినిమా విషయంలో కూడా అమీర్ ఖాన్ ఆ విధమైన వ్యాఖ్యలను అయితే ఎదుర్కొంటున్నాడు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమా విషయంలో కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్స్ భారీగానే వైరల్ అవుతున్నాయి.

బాయ్‌కాట్‌ చేయవద్దు

బాయ్‌కాట్‌ చేయవద్దు

అయితే గతంలో అయితే పెద్దగా అమీర్ ఖాన్ బాయ్‌కాట్‌ నెగటివ్ కామెంట్స్ గురించి పెద్దగా స్పందించింది లేదు. కానీ ఇటీవల మాత్రం ఆయన చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన సినిమాను బాయ్‌కాట్‌ చేయవద్దు అని నేను కూడా భారతదేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పాడు.

అమీర్ ఖాన్ ఆవేదన

అమీర్ ఖాన్ ఆవేదన

ఒక విధంగా బాయ్‌కాట్‌ చేయడం అనే కామెంట్లు తనను తీవ్రంగా బాధకు కలిగిస్తున్నాయని నేను ఇండియాను ప్రేమించడం లేదు అని కొందరు ఎక్కువగా విశ్వసిస్తున్నారు అంటూ అది నిజం కాదు అని అన్నారు. ఇక అలా వాళ్ళు అనుకోవడం నా దురదృష్టకరమంటూ దయచేసి నా సినిమాను బాయ్‌కాట్‌ చేయవద్దని సినిమా చూడండి అని అమీర్ ఖాన్ మరింత ఆవేదన వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X