ఆ విషయంలో చాలాసార్లు ఫెయిల్.. ఈసారి మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నా..: అమీర్

Recommended Video

ఆ బలహీనత నన్ను వదలడం లేదు....అంటున్న అమిర్‌

అందరూ ఆయన్ను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని పిలిస్తే.. ఆయన మాత్రం తనకూ ఓ బలహీనత ఉందని చెబుతున్నారు. ఆ బలహీనతను అధిగమించడానికి గతంలోనూ ప్రయత్నించి విఫలమయ్యారట. అయితే త్వరలోనే దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తానని మాత్రం చెబుతున్నారు. ఇంతకీ ఏంటా బలహీనతా?.. ఎవరా వ్యక్తి?.

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్ ఇటీవలే(మార్చి 14)న తన తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనలోని ఓ బలహీనత గురించి బయటపెట్టారు. చాలాకాలంగా 'స్మోకింగ్' తనను బలహీనతలా వెంటాడుతోందని చెప్పారు. ఎంత ప్రయత్నించినా.. దానికి దూరంగా ఉండలేకపోతున్నానని వెల్లడించారు.

దంగల్ తర్వాత మళ్లీ..

దంగల్ తర్వాత మళ్లీ..

నిజానికి గతేడాదే స్మోకింగ్ మానేయాలని అమీర్ గట్టిగా నిశ్చయించుకున్నారట. అనుకున్నట్టుగానే కొద్ది రోజులు స్మోకింగ్ కూడా మానేశారట. కానీ గతేడాదే విడుదలైన తన సినిమా 'దంగల్' భారీ విజయం సాధించడంతో మళ్లీ స్మోకింగ్ మొదలుపెట్టారట.

 ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నా..

ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నా..

'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అన్న మాట విన్న ప్రతీసారి దానికి దూరంగా ఉండాలనుకుంటాను, స్నేహితులకూ అదే చెబుతాను.. కానీ ఎందువల్లో నేను మాత్రం స్మోకింగ్ మానేయలేకపోతున్నానని చెప్పారు అమీర్. మానేయాలని ప్రయత్నించిన ప్రతీసారి విఫలమయ్యానని అన్నారు. అయితే ఈసారి మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నానని, త్వరలోనే మానేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.

 కిరణ్ రావ్ వల్లే ఇన్‌స్టాగ్రామ్‌

కిరణ్ రావ్ వల్లే ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్నాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉన్న అమీర్.. ఇటీవలే అందులోనూ ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా.. తన తల్లి పాత చిత్రాన్ని ఆయన షేర్ చేయడం విశేషం. తన తల్లి వల్లే ప్రస్తుతం తాను ఈ స్థాయికి వచ్చానని అందుకే ఆమె ఫోటోనే మొదటగా షేర్ చేస్తున్నానని తెలిపారు.

భార్య కిరణ్ రావు వల్లే తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరాల్సి వచ్చిందని వెల్లడించారు. గతంలో ఆమె అడిగినప్పుడు చాలాసార్లు వద్దన్నానని, కానీ ఎట్టకేలకు ఆమె నాతో ఇన్‌స్టా అకౌంట్‌ తెరిచేలా చేయించిందని చెప్పారు.

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

ప్రస్తుతం అమీర్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. జోధ్‌పూర్‌లో దీని చిత్రీకరణ జరుగుతోంది. కత్రినా కైఫ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్‌ బి అమితాబ్, ఫాతిమా సనా షేక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X