మీటూ ఎఫెక్ట్: ఆ సినిమా నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్!
బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉధృతం అయిన #మీటూ ఉద్యమం ఎవరూ ఊహించని ప్రముఖుల పేర్లు బట్టబయలు చేస్తోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సెక్సువల్ ప్రిడేటర్స్(కామాంధులు)కు చుక్కలు చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.... బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతడితో కలిసి పని చేయాలనుకున్న గుల్షన్ కుమార్ బయోపిక్ 'మొగుల్' నుండి తప్పుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో భాగం కావాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

అఫీషియ్‌గా వెల్లడించిన అమీర్ ఖాన్
ఫిల్మ్ మేకర్ పేరు కానీ, ప్రాజెక్ట్ పేరు కానీ ప్రస్తావించకుండా అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లైంగిక వేధింపులు, ఇతరుల పట్ల అనుచిత ప్రవర్తించడాన్ని సహించదు. #మీటూ ఉద్యమం ఉధృతం అయిన తర్వాత మాకు కొన్ని విషయాలు తెలిశాయి. ఓ వ్యక్తితో కలిసి సినిమాను చేయాలనుకున్నాం, కానీ ఆ వ్యక్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నాం. దోషులెవరో న్యాయస్థానమే తేలుస్తుంది.' పేర్కొన్నారు.

అమీర్ ఖాన్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్న దర్శకుడు
అమీర్ ఖాన్, కిరణ్ రావ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు సుభాష్ కపూర్ పేర్కొన్నారు. నా నిజాయితీని కోర్టులోనే నిరూపించుకుంటానని ట్వీట్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కాప్ పంచాయితీలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఇది ఉందన్నారు.

2014లో నటి గీతిక ఆరోపణలు
సుభాష్ కపూర్ మీద 2014లో నటి గీతిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అప్పుడు నమోదైన కేసు ఇపుడు.... ఇపుడు మీటూ ఉద్యమం నేపథ్యంలో మరోసారి హాట్ టాపిక్ అయింది. అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడానికి కారణం కూడా అదే. అతడితో పని చేస్తే తన ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తనుశ్రీ దత్తా వ్యవహారంతో ఉధృతం
బాలీవుడ్లో అడపా దడపా #మీటూ మూమెంట్ కనిపిస్తున్నా.... ఇటీవల తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద ఆరోపణలు చేసిన తర్వాత ఈ ఉద్యమం మరింత ఉధృతం అయింది. బాలీవుడ్ నుండి సైత్ ఇండస్ట్రీకి కూడా ఇది విస్తరించింది. ఇప్పటి వరకు నానా పాటేకర్‌తో పాటు వికాష్ బహల్, అలోక్ నాథ్, వైరముత్తు, రఘు దీక్షిత్ పేర్లు ఈ ఉద్యమం ద్వారా బయటకు వచ్చాయి.


Click it and Unblock the Notifications











