twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్థరాత్రి అమీర్ ఖాన్ సాయం.. మా అన్నయ్య ప్రాణాలు నిలిచాయి, ఆయన లేకుంటే!

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మానవతా దృక్పధం ఉన్న హీరో అని మరోమారు రుజువైంది. సామాజిక అంశాల గురించి ఆలోచించే హీరోలలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అమీర్ చిత్రాలు కూడా ప్రజలని చైతన్య పరిచే విధంగా ఉంటాయి. తాజాగా తన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ ఆరోగ్యం విషయంలో అమీర్ చూపించిన చొరవ అతడి ప్రాణాలని నిలబెట్టింది. అమీర్ అందించిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.

    జాతీయ అవార్డు

    జాతీయ అవార్డు

    అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దంగల్ కు షాజిత్ అనే సౌండ్ ఇంజనీర్ పనిచేశాడు. షాజిత్ చాలా ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణుడు. ఓంకార అనే అనే చిత్రానికి గాను అతడు 2006 లో జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు.

    అనారోగ్యంతో

    అనారోగ్యంతో

    షాజిత్ ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. కిడ్నీ సంబంధింత వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రికి వెళ్లగా, అమీర్ ఖాన్ అందించిన సాయంతో షాజిత్ తన ప్రాణాలు దక్కించుకున్నాడు.

    పట్టించుకోని సిబ్బంది

    పట్టించుకోని సిబ్బంది

    కిడ్నీ సంబంధిత వ్యాధితో భాదపడుతున్న షాజిత్ ని అతడి కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో షాజిత్ ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ సమయంలో ఐసీయూలో సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. కానీ వైద్యులు అందుబాటులో లేరు. గంటలు గడిచే కొద్దీ షాజిత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారుతుండడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

    తప్పని పరిస్థితుల్లో

    తప్పని పరిస్థితుల్లో

    ఇక ఆలస్యం చేస్తే కుదరదని షాజిత్ కుటుంబ సభ్యులు భావించారు. అతడి సోదరి అర్థ రాత్రి దాటినా సాయం కోసం అమీర్ ఖాన్ కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. షాజిత్ ని ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించాడు.

    అనిల్ అంబానీ

    అనిల్ అంబానీ

    అనిల్ అంబానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే ట్రీట్ మెంట్ మొదలయ్యేలా చొరవ తీసుకున్నాడు. ప్రస్తుతం షాజిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

    షాజిత్ సోదరి

    షాజిత్ సోదరి

    అమీర్ చేసిన సాయం గురించి షాజిత్ సోదరి స్పందించింది. అమీర్ ఖాన్ వల్లే తన సోదరుడి ప్రాణాలు దక్కాయని ఎమోషనల్ అయింది. ఆ సమయంలో ఆయన స్పందించి ఉండకపోతే తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని తెలిపింది. లీలావతి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. షాజిత్ కుటుంబ సభ్యుల ఆరోపణలని లీలావతి ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది.

    English summary
    Aamir Khan Helped Dangal Crew Member Allegedly Left Unattended By Doctors. Aamir Khan reportedly played an instrumental role in saving the life of his colleague Shajith Koyeri
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X