మహాభారతమా? అదేంటి.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా దారుణ పరాజయం తర్వాత మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అచితూచి అడుగు వేస్తున్నాడు. తన తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. రూ.1000 కోట్లతో మహాభారత్ తెరకెక్కించబోతున్నారనే ప్రశ్నకు అమీర్ అయోమయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహాభారత్ చిత్రంపై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేమిటంటే..

నాలుగు కథలపై అమీర్ తర్జనభర్జన
ప్రస్తుతం నా వద్ద నాలుగు సినిమాల కథలు రెడీగా ఉన్నాయి. కాకపోతే ఏది బాగుంటుందో అనే విషయంపై ఇంకా నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. మరో నెలలో ఏదో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాను. దానిని నేనే స్వయంగా నిర్మిస్తాను అని అమీర్ ఖాన్ వెల్లడించారు.

బాడీ కోసం వర్కవుట్లు మొదలుపెట్టాను
తాను చేయబోయే పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. అందుకోసం నేను వర్కవుట్లు, ఆహార నియమాలను పాటిస్తున్నాను. ఆ సినిమా కోసం నా దేహాధారుడ్యం చాలా తప్పనిసరి. నేను మరింత సన్నగా కనిపించడానికి కసరత్తులు ప్రారంభిస్తాను. ప్రస్తుతం రెండు సినిమా కథలు నన్ను ఊరిస్తున్నాయి. ఆ రెండింటిలోనూ సన్నగా కనిపించాలి అని అమీర్ పేర్కొన్నారు.

మహాభారతమా? ప్రకటించలేదు
మహాభారత్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన వద్ద ప్రస్తావించగా.. మహాభారత్ గురించి నేను ఎన్నడూ ప్రకటించలేదు. మీరే ఊహించుకొన్నారు. నాకు ఇంకా దానిపై ఎలాంటి ఆలోచన లేదు. ఎప్పుడైనా మహాభారతాన్ని నిర్మించాలనుకొంటే మీకు అన్ని విషయాలు చెబుతాను అని అమీర్ అన్నారు.

మీడియాలో ఊహాగానాలకు స్పందించను
మహాభారత్ చిత్రంపై వచ్చే ఊహగానాలకు నేను స్పందించను. ఒకవేళ ఏదైనా విషయాన్ని నేను చెబితే దానికి సమాధానం ఇస్తాను. మహాభారత్ సినిమా గురించి నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. దానికి నేను ఏమని సమాధానం ఇవ్వాలి అని అమీర్ ఖాన్ అన్నారు.

రూ.1000 కోట్లతో మహాభారతం
గతంలో మహాభారత్ చిత్రాన్ని అమీర్ ఖాన్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల వ్యయంతో నాలుగు భాగాలుగా సినిమాలను తెరకెక్కిస్తారు. ఈ సినిమాకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ నిర్మాతగా వ్యవహరిస్తారు అనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











