అమీర్ ఖాన్‌కు ప్రమాదం.. పక్కటెముక విరిగినా.. బాధను భరిస్తూ షూటింగ్‌లో
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీకి సమీపంలో జరుగుతున్న లాల్ సింగ్ చాద్దా చిత్ర షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. అయితే తన తీవ్ర గాయం అయినప్పటికీ షూటింగును అలాగే కొనసాగించారనే విషయం బయటకు వచ్చింది. అమీర్ ఖాన్ గాయం, ప్రమాదం గురించి మరింత వివరాల్లోకి వెళితే...

లాక్‌డౌన్ తర్వాత లాల్ సింగ్ చాద్దా షూటింగ్‌లో
లాక్‌డౌన్ తర్వాత అమీర్ ఖాన్ తన తాజా చిత్రం లాల్ సింగ్ చాద్దా షూటింగును ప్రారంభించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల్లో భాగంగా అమీర్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. పక్క టెముక విరిగిపోయి విలవిలలాడారు. కాసేపు విశ్రాంతి తర్వాత నొప్పి భరిస్తూ షూటింగులో పాల్గొన్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

షూటింగ్‌కు అంతరాయం కలుగకుండా
లాల్ సింగ్ చాద్దా సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా టెక్నిషియన్స్, నటీనటులు సిద్ధమయ్యారు. దాంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడితే మళ్లీ నటీనటులను సమకూర్చడం కష్టమవుతుందని అమీర్ ఖాన్ భావించారు. అందుకే పెయిన్ కిల్లర్స్ వాడుతూ షూటింగును కొనసాగించారు. అలా రోజంతా పక్కటెముక విరిగిన బాధతోనే షూటింగు చేశారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

పోరాట సన్నివేశాల చిత్రీకరణ
లాల్ సింగ్ చాద్దా సినిమాలో కీలకంగా మారిన పోరాట సన్నివేశాలను అమీర్ ఖాన్ చిత్రీకరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు, సురక్షిత ప్రమాణాలను పాటించినప్పటికి దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. షూటింగ్‌కు అంతరాయం కలుగకుండా ఇతర నటీనటులకు ఇబ్బంది కలుగకుండా తాను బాధను ఓర్చుకొని షూటింగ్ చేశారు. ఆయన డెడికేషన్‌కు ఇదో ఉదాహరణ మాత్రమే అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా
హాలీవుడ్‌లో ఘన విజయంతోపాటు ఆస్కార్ పురస్కరాలను అందుకొన్న ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా లాల్ సింగ్ చాద్దా మూవీ తెరకెక్కుతున్నది. 1994లో రిలీజైన ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని రీమేక్ చేస్తూ స్వయంగా అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిష్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











