అమీర్ ఖాన్‌కు ఊరట.. తల్లికి కరోనా నెగిటివ్
ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకు కొన్ని వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబైలో పరిస్థితి అదుపు తప్పింది. వారికి వీరికి అని తేడా లేకుండా కరోనా అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా సెలెబ్రిటీలకు కరోనా భయం మరింతగా పట్టుకుంది. వారి సిబ్బందికి కరోనా రావడంతో ఇది వరకే ఎంతో మంది క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. తాజాగా ఆమీర్ ఖాన్ కుటుంబం కూడా క్వారంటైన్‌లోనే ఉండాల్సి వచ్చింది.

సోషల్ మీడియాలో ప్రకటన..
ఆమిర్ ఖాన్ చేసిన ఓ ప్రకటన అందరికీ ఆందోళన కలిగించింది. తన సిబ్బందికి కరోనా వచ్చిందని ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే తమ కుటుంబం అందరికీ నెగెటివ్ అని వచ్చిందని, అమ్మకు సంబంధించిన ఫలితం మాత్రం ఇంకా రాలేదని ఆమిర్ ప్రకటించాడు.

అందరికీ పరీక్షలు..
తన స్టాఫ్‌లో కొంతమందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని ఆమిర్ ఖాన్ తెలిపాడు. దాంతో తామంతా క్వారంటైన్‌లోకి వెళ్లామని పేర్కొన్నాడు. బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సకాలంలో స్పందించి వైద్య సదుపాయాలను అందజేస్తున్నారని పేర్కొన్నాడు.

అద్భుతమైన సేవలు..
కోవిడ్ పరిస్థితులకు, ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు సహాయం అందించడంలోనూ, అలాగే వైద్య సదుపాయాలు కల్పించడంలో బీఎంసీ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. కరోనా పరీక్షలను వారు ఎంతో ఓర్పు, సహనంతో చేస్తున్నారు. రోగులపట్ల వారు చూపిస్తున్న దయ, కరుణ చూపుతున్న కోకిలాబెన్ వైద్య సిబ్బంధిపై ప్రశంసలు కురిపించారు.
Recommended Video

మా అమ్మకు నెగెటివ్..
తాజాగా ఆమిర్ ఖాన్ ఓ శుభవార్త చెప్పాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ బాగుండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











