మూడో పెళ్లి అలా జరిగిపోయింది... బాంబు పేల్చిన అమీర్ ఖాన్

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ చుట్టే అన్నీ వార్తలు చుట్టూరా తిరుగుతున్నాయి. ఆయన రూపొందించిన సితారే జమీన్ పర్ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా.. ఆయన తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మూడోసారి ప్రేమలో పడ్డారు. గౌరీ స్ప్రాట్ అనే ముంబై సెలబ్రిటీతో ఆయన రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారిద్దరి గురించే హిందీ మీడియా కథనాలు వెల్లడిస్తున్నది. ఈ క్రమంలో గౌరీతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ..

మా ఇద్దరి మధ్య పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. అనుకోకుండా ఒకరికి మరొకరం పరిచయం అయ్యాం. అలాగే మేము కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత మేము ఫ్రెండ్స్‌గా మారాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఏర్పడింది. నా తల్లితో, నా పిల్లలతో, నా తోబుట్టువులతో ఉన్నంత బంధమే ఆమెతో ఉంది. నా జీవితంలోకి ఆమె వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది అని అమీర్ ఖాన్ తెలిపారు.

Aamir Khan about Gauri Spratt

లేటు వయసులో ప్రేమలో పడిన అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో ఉన్న అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చారు. మా రిలేషన్‌లో ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు. మా లైఫ్‌ను ముందుకు కొనసాగిస్తున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటింది. సంప్రదాయాలకు అతీతంగా మా బంధం ఏర్పడింది. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది అని అమీర్ ఖాన్ చెప్పారు.

గౌరీతో నా రిలేషన్ చాలా సీరియస్. ఈ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కమిట్‌మెంట్‌తో ఉన్నాం. మేమిద్దరం ఇప్పుడు భాగస్వాములం. మేము కలిసి జీవిస్తున్నాం. పెళ్లి అనేది ఒక తంతు మాత్రమే. నా హృదయం ఎప్పుడో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకొన్నది. మేమిద్దరం ట్రెడిషినల్‌గా పెళ్లి చేసుకొంటామా? లేదా? అనేది కాలమే చెబుతుంది అని అమీర్ ఖాన్ అన్నారు.

మా ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంది. మానసికంగా మాకు ఇప్పటికే ఎప్పుడో పెళ్లి జరిగింది. నా హృదయంలో ఆమెకు చోటు ఇచ్చినప్పుడే మా మ్యారేజ్ జరిగిపోయిందని అనుకొంటున్నా. అలాంటి ఫీలింగ్‌తోనే కలిసి జీవిస్తున్నాం. సంప్రదాయకంగా పెళ్లి జరగకపోయినా మా ఇద్దరి జీవితం హ్యాపీగా ముందుకు సాగిపోతున్నవి. మా ఇద్దరి మధ్య ఎలాంటి సందేహాలు లేవు అని అమీర్ ఖాన్ అన్నారు.

Aamir Khan about Gauri Spratt

గౌరీ స్ప్రాట్ గురించిన వివరాల్లోకి వెళితే.. ముంబైలో ప్రధాన ప్రాంతంలో ఆమెకు సెలూన్ ఉంది. గత కొద్దికాలంగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌తో కలిసి ముందుకు వెళ్తున్నారు. అమీర్ ఖాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లో ఆమె ప్రత్యక్షంగా చొరవ తీసుకొంటున్నది. ఈ మధ్యకాలంలో వారిద్దరూ ముంబైలోని పలు ప్రదేశాల్లో కనిపించారు. సితారే జమీన్ పర్ సినిమా ప్రీమియర్ మధ్య ఇద్దరు అన్యోన్యంగా కనిపించడం తెలిసిందే.

అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. వరుస ఫ్లాపుల తర్వాత ఇటీవల నటించి, నిర్మించిన సితారే జమీన్ పర్ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ఆయన అతిథి పాత్రలో నటించిన కూలీ చిత్రం ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X