‘నాకు క్రమశిక్షణ లేదు.. రాత్రంతా అదే పని.. ’స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

'నా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు సమయానికి వెళ్లేవాడ్ని. నేను పైప్‌ స్మోకింగ్‌, రాత్రంతా పుల్ గా మద్యపానం సేవించేవాడ్ని. తప్పు చేస్తున్నననీ, పలు మార్లు నాకు నేను అనుకున్నా.. కానీ, మందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టలేకపోయాను. కానీ, తరువాత నాకు నేను రియాలైజ్ అయ్యాను' అంటూ ఓ స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలోని చెడు అలవాట్లను బయటపెట్టారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అసలేం జరిగింది?

ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan). ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించారు. ఆయన తాను పోషించే పాత్ర కోసం ఎంత‌టి రిస్క్ చేయ‌డానికైనా వెనకాడ‌రు. పాత్ర కోసం ఏ విధంగా కావాలంటే.. ఆ విధంగా తనని తాను మలుచుకుంటారు. అన్ని రకాల జోనర్ లలో నటించారు యాక్టర్ అమీర్ ఖాన్. అందుకే అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ పిలుస్తారు.

Aamir Khan opened up about his bad habits including smoking a pipe Drink All Night

తాజాగా అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు. నానా పటేకర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవిత రహస్యాలను బయటపెట్టాడు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ - 'నేను ఇప్పుడు మద్యం సేవించడం మానేశాను. కానీ, ఇప్పటికీ సిగరెట్ తాగుతాను.కానీ, గతంలో రాత్రంతా కూర్చొని మద్యం సేవించే వాడ్ని. అలా చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది, నాకు కూడా ఇది అలవాటు ఉండేది. కానీ నేను చేస్తున్నది సరైనది కాదని, నాకు తరువాత అర్థమైంది. కానీ నన్ను నేను ఆపుకోలేకపోయాను' అమీర్ ఖాన్ అన్నారు.

ఈ క్యాడీ చాట్‌లో అమీర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ పాటించకపోవడమే తన చెత్త అలవాటు. అయితే ఆ తర్వాత సినిమా షూటింగ్‌లో అలా కాదు. నేను సినిమాల షూటింగ్‌ల కోసం ఎప్పుడూ సమయానికి చేరుకుంటాను. కాబట్టి నేను సినిమాలు, పని విషయంలో పూర్తిగా క్రమశిక్షణతో ఉంటాను. కానీ జీవితంలో కొన్ని విషయాల్లో క్రమశిక్షణ లేకుండా ఉంటాను ' అని పేర్కొన్నారు.

Aamir Khan opened up about his bad habits including smoking a pipe Drink All Night

అమీర్ ఖాన్ చివరిసారిగా 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం ఆగస్టు 11, 2022న విడుదలైంది. ఈ చిత్రంలో అమీర్‌తో పాటు కరీనా కపూర్, మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై అమీర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ అయింది.

More from Filmibeat

Read more about: nana patekar aamir khan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X