పీకల్లోతు కష్టాల్లో మురగదాస్.. ఆదుకోవడానికి అమీర్ ఖాన్ రంగం సిద్ధం
సినిమా పరిశ్రమలో హిట్టు కొడితే రాజుగా చూసే వాళ్లే.. ఫ్లాఫ్ ఇస్తే దర్శకులను ఎలా చూస్తారనే మాటల్లో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏఆర్ మురగదాస్ పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తున్నది. వరుస వైఫల్యాలతో ఈ టాప్ దర్శకుడు తడబాటుకు గురవుతున్నాడు. మహేష్ బాబుతో స్పైడర్, రజనీకాంత్‌తో దర్బార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పరిస్థితి తలకిందులుగా కనిపిస్తున్నది. అయితే కష్టాల్లో ఉన్న మురగదాస్‌ను బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఆదుకోనున్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

స్పైడర్, దర్బార్ ఫ్లాపులతో
స్పైడర్ ఫ్లాప్ తర్వాత దర్బార్ చిత్రంపై ఏఆర్ మురగదాస్ గంపెడాశలు పెట్టుకొన్నారు. రజనీకాంత్, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు గొడవ పెట్టడం, నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేయడం వివాదంగా మారింది.

మురగదాస్ బాలీవుడ్ రీ ఎంట్రీ
ఇలాంటి కష్టాల్లో ఉన్న మురగదాస్‌కు మంచి రోజులు రాబోతున్నాయనే వార్త అభిమానులకు సంతోషాన్ని నింపబోతున్నది. త్వరలోనే మురుగదాస్ బాలీవుడ్ గుమ్మాన్ని మళ్లీ తొక్కబోతున్నాడు. తనకు గజని లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌నే కాకుండా రికార్డు హిట్‌ను అందించిన మురగదాస్‌తో ఓ సినిమాను రూపొందించడానికి అమీర్ ఖాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

తొలి 100 కోట్ల క్లబ్‌లో గజిని
బాలీవుడ్‌లో సరైన హిట్ లేకుండా ఇబ్బందుల్లో ఉన్న అమీర్ ఖాన్‌ను మురగదాస్ గజని చిత్రంతో ఆదుకొన్నారు. ఆ చిత్రం హిందీ చిత్ర పరిశ్రమలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. అలాంటి క్రెడిట్‌ను అందించిన మురగదాస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి గజనీ మూవీకి సీక్వెల్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
Recommended Video


లాల్‌సింగ్ చద్దా మూవీలో
ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కరీనా కపూర్ హీరోయిన్'గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం హాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











