మహాభారతం: టంగ్ స్లిప్ అయిన షారుక్... అమీర్ ఖాన్ పాత్ర చెప్పేశాడు!
రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సారే జహాసె అచ్చా' చిత్రంలో నటించడానికి అమీర్ ఖాన్ నో చెప్పారని... అందుకు కారణం ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' మొదలుపెట్టే ఆలోచనలో ఉండటమే అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం నిజమే అనేలా హింట్ ఇస్తూ షారుక్ ఖాన్ తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు 'మహాభారతం'లో అమీర్ ఖాన్ ఏ పాత్ర చేయబోతున్నాడనే విషయం కూడా వెల్లడించడం విశేషం.

అలా టంగ్ స్లిప్ అయ్యాడు
ఇటీవల ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్ తనకు ‘మహాభారతం'లోని కృష్టుడి పాత్ర చేయడం అంటే ఎంతో ఇష్టమని, అయితే దాన్ని అమీర్ ఖాన్ ఇప్పటికే ఎంచుకున్నాడని వెల్లడించి టంగ్ స్లిప్ అయ్యారు.

రాకేష్ శర్మ బయోపిక్‌లో షారుక్
రాకేష్ శర్మ బయోపిక్‌లో మొదట అమీర్ ఖాన్‌ను అనుకున్నప్పటికీ అతడు మహాభారతం షూటింగులో బిజీగా ఉండటంతో..... షారుక్ ఖాన్‌తో ఈ బయోపిక్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రూ. 1000 కోట్లతో
‘మహాభారతం' చిత్రం ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇది ఒక చిత్రంగా కాకుండా అనేక పార్టులుగా ప్లాన్ చేస్తున్నారట.

15 నుంచి 20 ఏళ్లు ఈ సినిమా కోసమే
గతంలో ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... మహాభారతం తన కలల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలు పెడితే దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల సమయం కేటాయించాల్సి ఉంటుంది, అదే భయంగా ఉంది అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











