లాల్ సింగ్ చద్దా యూనిట్ మీద 'చెత్త' ఆరోపణలు.. యూనిట్ రియాక్షన్ ఏంటంటే?

నటుడు అమీర్ ఖాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముందు విడాకుల వార్తలతో హల్చల్ చేయగా ఇప్పుడు అమీర్ తన రాబోయే చిత్రం 'లాల్ సింగ్ చద్దా' గురించి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడఖ్‌లో జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ లడఖ్‌లో కాలుష్యాన్ని వ్యాపింపచేస్తోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తుచారు. ఒక సోషల్ మీడియా యూజర్ ఇటీవల ఒక వీడియోను పంచుకున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో లడఖ్‌లోని వఖా గ్రామం కనిపిస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు ఈ గ్రామం బాగా కలుషితమైందనే విధంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో వాహనాలు నిలిపిన చోట ప్లాస్టిక్ సీసాలు, చెత్త మరియు ఇతర వస్తువుల మొదలు కాలుష్యం తాలూకా సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ వీడియోలో క్యాప్షన్ ఇలా ఉంది, 'ఇది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ రాబోయే చిత్రం లాల్ సింగ్ చద్దా లడఖ్ వాఖా గ్రామస్తులకు ఇచ్చిన బహుమతి. సత్యమేవ్ జయతే పర్యావరణాన్ని శుభ్రపరచడం గురించి అమీర్ ఖాన్ స్వయంగా మాట్లాడుతుంటారు, కానీ సొంత విషయానికి వస్తే ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. ఇక నిజానికి నాగచైతన్య ఈ సినిమా యూనిట్ నుంచి ఒక ఫోటో పంచుకున్నారు. ఈ ఫోటోలో అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావు విడాకుల ప్రకటన తర్వాత మొదటిసారి కలిసి కనిపించారు. ఇక తాజాగా దీనికి సంబంధించి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

Aamir Khan Productions clarity on Laal Singh Chaddha location litter in Ladakh

ఈ విషయం మీద ఒకటి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నామని తమ కంపెనీ కచ్చితంగా పరిశుభ్రత విషయంలో ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము అని చెప్పుకొచ్చింది. మేము షూటింగ్ జరిగే చోట పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసం ఒక టీం పనిచేస్తుందని ప్రతిరోజు షూటింగ్ ముగియగానే లొకేషన్ మొత్తం చెక్ చేసి క్లీన్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. మేము షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉందో పూర్తి చేసిన తర్వాత కూడా అలాగే ఉండేలాగా ఆ టీమ్ చూసుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. తమ గురించి చేస్తున్నవన్నీ ఆరోపణలు అని కొట్టివేస్తూ లోకల్ అథారిటీస్ ఎప్పుడైనా వచ్చి తమ షూటింగ్ లొకేషన్ చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X