twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ టీమ్‌పై రూమర్లు.. అలాంటి ‘చెత్త’ రాతలు రాస్తే చట్టపరంగా చర్యలు.. మిస్టర్‌ పర్‌ఫెక్ట్ వార్నింగ్

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ లడఖ్‌లో జరుగుతున్నది. ఇటీవలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య యూనిట్‌తో జతకలిశాడు. అయితే సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఇటీవల కాలంలో వాటికి కేంద్ర బిందువుగా మారారు. తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమా యూనిట్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో వారు స్పందించారు. ఆ సినిమా వివాదం ఏమిటంటే..

    లడఖ్‌ పర్యావరణానికి విఘాతం అంటూ

    లడఖ్‌ పర్యావరణానికి విఘాతం అంటూ

    లడఖ్‌లో అమీర్ ఖాన్ యూనిట్ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ వీడియోను రిలీజ్ చేశారు. లడఖ్‌లోని వాఖా అనే గ్రామస్థులను అమీర్ ఖాన్ టీమ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సత్యమేవ జయతే లాంటి షోను నిర్వహించే అమీర్ ఖాన్ ఇలాంటి పనులకు పాల్పడటం సరికాదు అంటూ ఘాటుగా స్పందించారు.

     చెత్త చెదారంతో నింపేస్తున్నారంటూ

    చెత్త చెదారంతో నింపేస్తున్నారంటూ

    దాంతో మంచి పర్యావరణానికి మారుపేరైన లడఖ్ ప్రాంతంలో అమీర్ ఖాన్ సినిమా షూట్ చేస్తున్నారు. అయితే లాల్ సింగ్ చద్దా యూనిట్ అంతా ఆ ప్రాంతాన్ని చెత్త చెదారంతో నింపి వేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో అమీర్ ఖాన్ టీమ్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

    ఆరోపణల్లో వాస్తవం లేదంటూ అమీర్ ఖాన్

    ఆరోపణల్లో వాస్తవం లేదంటూ అమీర్ ఖాన్

    అయితే లడఖ్ ప్రాంతాన్ని చెత్త చెదారంతో నింపేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ) స్పందించింది. ఆ టీమ్ సభ్యులు ఓ ప్రకటనను జారీ చేస్తూ.. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేవారిపై పరువునష్టం దావా వేస్తాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

    ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం లేదు

    ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం లేదు

    లడఖ్ ప్రాంతంలో మేము షూటింగ్ చేస్తున్న ప్రదేశంలో ఎలాంటి చెత్త వేయడం లేదు. పర్యావరణానికి భంగం కలిగించే విధంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను ఉపయోగించడం లేదు. చెత్త వేయకుండా, పర్యావరణానికి ముప్పు కలిగించే పదార్థాలను ఉపయోగించడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు అంటూ అమీర్ ఖాన్ ప్రోడక్షన్ వెల్లడించింది.

    Recommended Video

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
    లోకేషన్ చెక్ చేసుకోండంటూ వార్నింగ్

    లోకేషన్ చెక్ చేసుకోండంటూ వార్నింగ్

    తమ యూనిట్‌పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇస్తూ.. షూటింగ్ ప్రదేశంలో శుభ్రతను పాటించే విషయంలో అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం. చెలాంటి చెత్త చెదారం లేకుండా చర్యలు తీసుకొంటున్నాం. షూటింగ్ ముగిసిన తర్వాత కావాలంటే లోకేషన్‌కు వచ్చి చెక్ చేసుకోవచ్చు. దాంతో మీకు చెత్త ఉందా లేదా అనేది తెలుస్తుంది అంటూ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ ఘాటుగా స్పందించింది.

    English summary
    Aamir Khan Productions reacts on Littering in Ladakh. Reports suggest that Laal Singh Chaddha unit not maintain clean at locations. AKP warns such rumours spreaders.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X