సోషల్ మీడియాకు అమీర్ ఖాన్ గుడ్‌బై.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మిస్టర్ పర్‌ఫెక్ట్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అభిమానులకు భారీ షాకిచ్చాడు. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకొన్నారు. ఇటీవల పుట్టిన రోజు జరుపుకొన్న అమీర్ ఖాన్‌కు తన అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తారు. ఈ సందర్భంగా తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ చివరి సందేశాన్ని అందించారు.
నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. గత కొన్నేళ్లుగా నాకు అందించిన ప్రేమకు, సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. సోషల్ మీడియాలో ఇదే చివరి పోస్టు. ఎప్పటిలానే మీతో యాక్టివ్‌గా ఉంటాను. ఇంతకు ముందు మాదిరిగానే నేను మీతో కమ్యూనికేట్ చేస్తుంటాను అని తన పోస్టులో తెలిపారు. తన పనిమీదే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించడానికి ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు వెల్లడించారు.

అమీర్ ఖాన్ సోషల్ మీడియా ప్రయాణం గురించిన వివరాల్లోకి వెళితే... 11 ఏళ్ల క్రితం ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. గత మూడేళ్ల క్రితం ఇన్స్‌టాగ్రామ్‌లోకి ప్రవేశించారు. తాజాగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను షాక్ గురి చేసింది.
ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్్నారు. కరీనా కపూర్, ఎల్లీ అవ్రామ్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











