నిజంగానే తాగేసి నటించిన అమీర్ ఖాన్.. దర్శకుడు వద్దని చెప్పినా వినలేదు.. ఆ దెబ్బతో 450కోట్లు!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఖాన్ త్రయం మధ్య నిత్యం బాక్సాఫీస్ పోటీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ అందులో అమీర్ ఖాన్ చేసే సినిమాలు చాలా విబిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. ఇక అమీర్ ఖాన్ ఒక సినిమాలో నిజంగా తాగేసి నటించాడు. చాలామంది వద్దని చెప్పినప్పటికీ అతను వినలేదు. కానీ ఆ తరువాత ఆ సీన్ నిజంగానే సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

30 ఏళ్లుగా అదే ఆలోచనతో

30 ఏళ్లుగా అదే ఆలోచనతో

అమీర్ ఖాన్ కెరీర్ చాలా విబిన్నంగా కొనసాగింది. అవకాశాల ఆయన పెద్దగా పాకులాడింది లేదు. కానీ ఏదైనా సినిమా చేశాడు అంటే పాత్ర ఎలాంటిదైనా సరే ప్రాణం పెట్టేస్తాడు. నటుడు కావాలని ఇష్టం లేకపోయినప్పటికీ అనుకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టారట. ఇక ఆదరణ పెరుగుతున్నప్పుడు చేసే పనికి న్యాయం చేయాలని గత 30 ఏళ్లుగా ప్రతి సినిమా మొదటి సినిమా అనేలా వర్క్ చేస్తున్నారు.

ఆ విషయంలో తెలివిగా ఉంటారు

ఆ విషయంలో తెలివిగా ఉంటారు

కేవలం ఒక హీరోగానే కాకుండా రైటర్ గా దర్శకుడిగా కూడా అమీర్ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమాలో వీలైనంత వరకు మంచి సందేశం ఉండేలా కూడా ప్రయత్నాలు చేస్తారు. దర్శకుడికి సలహాలు ఇవ్వడంలో కూడా అమీర్ ఖాన్ చాలా తెలివిగా ఉంటారు. ఎవరిని హార్ట్ చేయకుండా కూల్ గా సీన్స్ ను మార్పించిన సందర్బాలు కూడా ఉన్నాయట.

దర్శకుడు వద్దని చెప్పినా..

దర్శకుడు వద్దని చెప్పినా..

అయితే ఒకనొక సందర్భంలో అమీర్ ఖాన్ తాగేసి సీన్ లో నటించాడట. దర్శకుడు ఇతర నటీనటులు వద్దని చెప్పినప్పటికీ సినిమాలో ఆ సీన్ చాలా కీలకం కావడంతో.. తాగినట్లు నటించకుండా, నిజంగానే తాగేసి నటించాలని డిసైడ్ అయ్యారట. కట్ చేస్తే ఆ సినిమా విడుదల అనంతరం 450కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఆ సీన్ కూడా సినిమా విజయంలో కీలకం పాత్ర పోషించింది.

రెండు పెగ్గులు వేసి..

రెండు పెగ్గులు వేసి..

ఆ సినిమా మరేదో కాదు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కిన త్రి ఐడియట్స్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాలో తన ఇద్దరి స్నేహితులతో కలిసి తాగే సన్నివేశంలో నిజంగా తాగితేనే సీన్ బాగా పండుతుందని అమీర్ ఖాన్ రెండు పెగ్గులు వేసి నటించారట.

Recommended Video

Prabhas Got Prestigious Bollywood Offer
నెంబర్ వన్ సినిమాగా

నెంబర్ వన్ సినిమాగా

మనకు లైఫ్ లో నచ్చింది చేయడమే బెస్ట్ ఎడ్యుకేషన్.. భయం లేకుండా మనకు నచ్చింది చదువుకుంటేనే బ్రెయిన్ కు ఎక్కుతుంది.. అని అమీర్ చెప్పిన డైలాగ్స్ సినిమాలో ఒక్కసారిగా ఎమోషన్ ను మార్చేస్తాయి. అది అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 450కోట్ల వసూళ్లను అందుకొని అప్పట్లో టాప్ ఇండియన్ సినిమాగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X