కుటుంబ సభ్యులే నరకం చూపించారు.. కరణ్ జోహార్ తేడాగా: అమీర్ ఖాన్‌పై సోదరుడు ఫైర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ లాక్ డౌన్ మొదలైన తరువాత కలలో కూడా ఊహించని వివాదాలు తెరపైకి వచ్చాయి. తారల మరణాలు, ముఖ్యంగా సుశాంత్ డెత్, నెపోటిజమ్ వంటి వివాదస్పద అంశాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ చేస్తున్న ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కరణ్ జోహార్ పై కూడా అతను సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబ సభ్యులే నరకం చూపించారు

కుటుంబ సభ్యులే నరకం చూపించారు


బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన తీరు హాట్ టాపిక్ గా మారింది. సొంత కుటుంబ సభ్యులే నరకం చూపించారని అతను ఒక ఇంటర్వ్యూలో ఆశ్చర్యపరిచే విషయాలను బయటపెట్టాడు. బాలీవుడ్ లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయని పరాజయల్లో ఉంటే చిన్నచూపు చూడటం ఇక్కడి వాళ్లకు చాలా అలవాటని అన్నాడు.

 ఇంట్లోనే నిర్బంధించారు.

ఇంట్లోనే నిర్బంధించారు.


ఫైజల్ మాట్లాడుతూ.. నాకు వ్యక్తిగతంగా ఎదగడానికి నా కుటుంబ సభ్యులు అన్నయ్య అమీర్ ఖాన్ ఎలాంటి సహాయం చేయలేదు. నేను సినిమా ప్రొడక్షన్ లోకి వెళ్లాలని నా కాళ్ళ మీద స్వతహాగా బ్రతకాలని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయకపోవడమే కాకుండా నన్ను ఏడాది పాటు ఇంట్లోనే నిర్బంధించారు.

తప్పుడు వార్తలు క్రియేట్ చేశారు.

తప్పుడు వార్తలు క్రియేట్ చేశారు.

నాకు మానసిక పరిస్థితి బాగోలేదని తప్పుడు వార్తలు క్రియేట్ చేశారు. అయితే నేను కోర్టును ఆశ్రయించి వైద్య పరీక్షలు కూడా చేసుకొని క్లీన్ చీట్ తెచ్చుకున్నాను. అప్పుడు కూడా మా వాళ్ళు సహాయం చేయలేదు. నేను అమీర్ ఖాన్ పై ఎప్పుడు ఆదరపడలేదు.

అతని మరణం ఇప్పటికే ఒక రహాస్యమే..

అతని మరణం ఇప్పటికే ఒక రహాస్యమే..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. అతనిపై బైపోలర్ అనే కామెంట్స్ రావడం దారుణం. అలాంటి లోపం ఉన్న వ్యక్తి వెండితెరపై అంత బాగా ఎలా నటించగలడు. సుశాంత్ కూడా హిట్ సినిమాలు చేశాడు. అతని మరణం ఇప్పటికే అలా రహాస్యంగానే ఉందాని ఫైజల్ అన్నాడు. ఈ ప్రపంచం మొత్తం అవినీతిలో మునిగిపోయిందిని స్వార్థంతో ఆలోచించే వారే ఎక్కువగా ఉన్నారని అన్నాడు.

Recommended Video

Prabhas Got Prestigious Bollywood Offer
కరణ్ జోహార్ తేడాగా...

కరణ్ జోహార్ తేడాగా...


ఇక బాలీవుడ్ లో అంతకు మించిన దారుణాలు చోటు చేసుకుంటున్నాయని కరణ్ జోహార్ ఒకసారి తనను చాలా అవమానానికి గురి చేశాడని ఫైజల్ ఆరోపించారు. అమీర్ ఖాన్ 50వ పుట్టినరోజు వేడుకలో కాస్త తేడాగా, అమర్యాదగా వ్యవహరీంచడాని ఆరోపిస్తూ.. చాలా చులకనగా మాట్లాడు అని అన్నారు. అలాగే వేరొకరితో మాట్లాడుతుంటే కూడా వారితో సంభాషనను కట్ చేసేవాడని కూడా ఫైజల్ వివరణ ఇవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X