మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో పడ్డ సూపర్‌స్టార్ కూతురు.. ఆ అపరిచితుడెవరంటే..

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ ఘనంగా వినిపిస్తున్నాయి. ఇరా అపరిచిత వ్యక్తితో ప్రేమలో పడిందని, వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. అయితే అటు అమీర్ ఖాన్ గానీ, ఇటు ఇరా ఖాన్ గానీ స్పందించలేదు. అయితే ఆ అపరిచిత వ్యక్తి ఎవరంటూ మాత్రం మీడియా ఆరా తీసినా.. ఆచూకీ లభించలేదు. అయితే తాజాగా ఇరా తన ప్రియుడు ఎవరనే విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇంతకు ఆ అపరిచిత వ్యక్తి ఎవరంటే..

 ఇన్స్‌టాగ్రామ్ చాటింగ్‌లో

ఇన్స్‌టాగ్రామ్ చాటింగ్‌లో

ఇన్స్‌టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఇరా ఖాన్ తాజాగా ఆస్క్ మీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేటింగ్ చేస్తున్నది ఎవరితో అనే ప్రశ్నకు జవాబిస్తూ.. సంగీత దర్శకుడు మిషాల్ కృపాలనీ పేరును బయటపెట్టింది. మిషాల్‌ను వాటేసుకొన్న ఫొటోలను బహిరంగపరిచింది.

నెటిజన్లకు షాకిచ్చిన ఇరా ఖాన్

నెటిజన్లకు షాకిచ్చిన ఇరా ఖాన్

గతంలో కూడా మిషాల్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది. కాకపోతే డేటింగ్‌లో ఉన్నట్టు గానీ, ప్రేమలో పడినట్టుగానీ వెల్లడించలేదు. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేయడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. దాంతో ఇరాకు తన అభిమానులు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ పంపుతున్నారు.

ఇరా ఖాన్, మిషాల్ కెమిస్ట్రీ

ఇరా ఖాన్, మిషాల్ కెమిస్ట్రీ

ఇరా, మిషాల్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేదనే విషయాన్ని గతంలో ఆమె పోస్టు చేసిన ఫోటోలు చెప్పకనే చెబుతాయి. నీ పాటల వీడియోలను వారానికి రెండుసార్లు చూస్తాను. ఆ రోజు నాకు సంపూర్ణమైన తృప్తి లభిస్తుంది అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫీలింగ్స్ చాటుకొన్నది.

మిషాల్ ఎమోషనల్ పోస్ట్

మిషాల్ ఎమోషనల్ పోస్ట్

ఇరా ఖాన్ పోస్టులపై కూడా మిషాల్ స్పందిస్తుంటాడు. ఇటీవల ఆయన జన్మదినోత్సవం రోజున ఎమోషనల్ పోస్టు పెట్టారు. హ్యాపీ బర్త్ డే బేబీ. నీవు చాలా సింపుల్‌గా ఉంటాడువ. అందుకే నాకు ఇష్టం. ఈ జన్మదినం ప్రత్యేకంగా గుర్తుండిపోవాలి. నీతో కలిసి నెట్‌ఫ్లిక్స్ చూడాలని ఉంది అంటూ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇరా ఖాన్ కెరీర్ గురించి

ఇరా ఖాన్ కెరీర్ గురించి

ఇక కెరీర్ విషయానికి వస్తే.. త్వరలోనే ఇరా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. నా కుమారుడు జునైద్‌కు యాక్టర్ కావాలని ఉంది. నా కూతురు ఇరా ఖాన్‌కు దర్శకురాలిగా మారాలని ఉంది అని తెలిపారు. ఇటీవల కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇరా పనిచేసినట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X