ప్రియుడితో కలిసి నైట్ డేట్... అమీర్ ఖాన్ కూతురు ఫోటోస్ వైరల్!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని షేర్ చేయడం ద్వారా తాను ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. మిషాల్ కిర్పాలానీ అనే మ్యూజీషియన్‌తో ఇరా ఖాన్ డేటింగ్ చేస్తోంది.
డేట్ నైట్ అనే క్యాప్షన్‍తో ఇరా ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ అమీర్ ఖాన్ అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇరా ఖాన్, మిషాల్ కిర్పాలానీ కాలిఫోర్నియాలోని శాంటా బార్పరాలో ఎంజాయ్ చేస్తూ ఈ ఫోటోస్ షేర్ చేశారు.

ఇరా, మిషాల్ కిర్పాలానీ
యుక్త వయసులోకి రాగానే అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం సర్వసాధారణమే. సాధారణ పిల్లలతో పోలిస్తే సినీ సెలబ్రిటీల పిల్లలకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే. ఈ జనరేషన్ సెలబ్రిటీ కిడ్స్ ఇలాంటి విషయాలను ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకోవడంలో ముందుంటున్నారు.

అతడు కూడా...
మిషాల్ కిర్పాలానీ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఇరా ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు. బిల్డింగ్‌లోకి మమ్మల్ని అనుమతించరు, కానీ మేము రూఫ్‌టాప్ మీదకు వచ్చామని తను షేర్ చేసిన ఫోటోలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అతడే నా వాలంటైన్
మిషాల్ కిర్పాలానీ నా వాలంటైన్‌గా పేర్కొంటూ ఇరా ఖాన్ గత నెలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి వాలంటైన్స్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

త్వరలో సినిమా ఇండస్ట్రీలోకి ఇరా ఖాన్
గతంలో కాఫీవిత్ కరణ్ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన పిల్లలు జునైద్, ఇరా సినిమా రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, వారి డ్రీమ్ నెరవేడానికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.


Click it and Unblock the Notifications











