twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ హీరో కూతుర్ని నలిపేసిన ప్రియుడు.. బార్‌లో అలా కెమెరాకు చిక్కి..

    |

    బాలీవుడ్ ముద్దుగుమ్మ, అమీర్ ఖాన్ గారాల కూతురు ఇరా ఖాన్ ఇంకా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందే మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రతీ నిత్యం అఫైర్లు, డేటింగ్, డిన్నర్ పార్టీలతో ఎప్పుడూ మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా తన ప్రియుడుతో చేసిన కౌగిలింత మీడియాను వేడెక్కించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే ఎంత గాఢంగా నలిపేశాడో మీకే అర్ధం అవుతుంది. వివరాల్లోకి వెళితే

     ప్రియుడితో జోరుగా డేటింగ్

    ప్రియుడితో జోరుగా డేటింగ్

    మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ కూతురు ఇరా ఖాన్ గత కొద్దికాలంగా గుట్టుచప్పుడు కాకుండా అఫైర్‌ను కొనసాగిస్తుంది. చాలా కాలం చాటుమాటుగా సాగించిన ఇటీవల ఆమె ప్రియుడు మిషాల్ కృపాలనీ అని బయటపడింది. వారిద్దరూ ముంబై వీధుల్లో చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అలా తిరుగుతూ మీడియాకు మంచి ఫీడ్‌ను అందిస్తున్నారు.

    ముంబై బార్‌లో

    ముంబై బార్‌లో

    అలా ఇరా, మిషాల్ వ్యవహారం కొనసాగుతుండగా.. ఇటీవల ముంబైలో ప్రముఖ బార్‌లో కనిపించారు. పాప్ సింగర్ జార్జ్ స్ట్రెయిట్ పాట ఐ జస్ట్ వాంట్ టు డ్యాన్స్ విత్ యూ పాటకు స్టెప్పులు వేశారు. ఇక బార్‌లో పొట్టి నిక్కరు వేసుకొని పసుపు రంగు టాప్ వేసుకొని కేక పెట్టించారు. అతి సన్నిహితంగా డ్యాన్స్ వేస్తూ తన్మయత్నంలో మునిగిపోయారు. అలా ఒకరినొకరిని విడదీయలేనంతగా కౌగిలించుకొని గాఢంగా ప్రేమలో మునిగిపోయారు.

    వైరల్‌గా గాఢమైన కౌగిలింత

    ప్రస్తుతం ఇరా, మిషాల్ కౌగిలింత వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. కౌగిలిలో నలిపేసేంతగా ఇరాను బంధించిన మిషాల్ వ్యవహారం హాట్ హాట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తుతున్నది. ఈ అమ్మడి వ్యవహారంపై ఘాటుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

    బాలీవుడ్‌లోకి అమీర్ ఖాన్ పిల్లలు

    బాలీవుడ్‌లోకి అమీర్ ఖాన్ పిల్లలు

    ఇక అమీర్ ఖాన్ పిల్లలు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. త్వరలోనే ఇద్దరు వారసులు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జునైద్ త్వరలో అమీర్ ఖాన్ రూపొందించే లాల్ సింగ్ బయోపిక్‌తో భాగస్వామ్య మయ్యారు. అలాగే ఇరా ఖాన్ ఫుట్ బాల్ గేమ్‌తోనూ, ప్రియుడితోను బిజీగా ఇలా వార్తల్లో మునిగి తేలుతున్నది.

    English summary
    Aamir Khan's daughter Ira melting away in her boyfriend's arms is the most drool-worthy video you'll come across today. She recently declared her love for Mishaal Kirpalani, confirming him as the person she is seeing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X