twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్‌గా మారుతున్న స్టార్ హీరో కూతురు.. బాయ్‌ఫ్రెండ్ గుడ్‌బై చెప్పి..

    |

    హాట్ హాట్ దుస్తులతోను, బాయ్‌ఫ్రెండ్‌తో అతిసన్నిహితంగా ఉంటూ మీడియాలో హల్‌చల్ రేపిన అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఇరా ఖాన్.. మరో వార్తతో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కూతురు దర్శకురాలిగా మారబోతున్నది.

    గతంలో ఇరా ఖాన్ కెరీర్ గురించి అమీర్ ఖాన్ వద్ద ప్రస్తావించగా.. సినిమా రంగంలోకి వస్తే సంతోషిస్తాను. తన కూతురు దర్శకురాలిగా మారుతుందా? లేకా నటిగా మారుతుందా అనే విషయంపై నాకు అవగాహన లేదు. ఆ విషయం ఆమె ఇష్టం మేరకే వదిలి వేశాను అని చెప్పారు.

    Aamir Khan’s daughter Ira Khan to make director debut

    అయితే ఇరా ఖాన్ దర్శకత్వం వహించేది సినిమాకు కాదు.. ఓ రంగస్థలంపై ఓ నాటకానిక డైరెక్షన్ చేయబోతున్నది. గ్రీక్ విషాదంతో కూడిన యురిపిడెస్ మేడియా అనే నాటకానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. తాజా నాటకానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ఈ నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 431 బీసీ నాటి నేపథ్యంగా ఈ నాటకం ఉంటుంది.

    ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ లైఫ్‌కే పరిమితమైన ఇరా ఖాన్ ఇప్పుడు కెరీర్‌పై దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌కు దూరమైనట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇరా ఖాన్‌కు సంబంధించిన తాజా వార్త అనేక అనుమానాలకు తెర లేపింది.

    English summary
    Aamir’s beti is all set to make her directorial debut with a theatre play, Euripides’ Medea, which is a Greek tragedy. The premiere of the play is scheduled in December this year and will be staged in multiple cities across India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X