అమీర్ ఖాన్ క్రేజీ గెటప్.. లాక్‌డౌన్‌లో సన్నింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌కు షాక్
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా స్ట్రిక్టుగా లాక్‌డౌన్‌ను, సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్త గెటప్స్ తెర మీద సందడి చేసే అమీర్ ఖాన్ ఇప్పుడు లాక్‌డౌన్‌లో న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని పంచారు. అమీర్ ఖాన్ కొత్త గెటప్ మీడియాలో వైరల్ అవుతున్నది.
లాక్‌డౌన్ సమయంలో అమీర్ ఖాన్ తన కూతురు ఇరా ఖాన్, భార్య కిరణ్ రావుతో కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. చాలా సన్నగా మారిపోయిన అమీర్ ఖాన్.. సాల్ట్ అండ్ పెప్పర్ (తెలుపు, నలుపు రంగు జుట్టుతో) కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఫొటోను చూస్తే ఇటీవలే అమీర్ ఖాన్ హెయిర్ కట్ చేయించుకొన్నట్టు కనిపించింది.

అమీర్ ఖాన్ ఫోటోను కూతురు ఇరా ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి.. జేన్‌మారీ.. ఐ లవ్ యూ. నిన్ను చూసి నేను గర్వంగా ఫీలవుతున్నాను. క్వారంటైన్ ఉన్నా లేకపోయినా.. మంచి, చెడు సమయాలకు సంబంధం లేకుండా నీతో ఉండటానికి నేను హ్యాపీగా ఫీలవుతాను. నీవు మాతో లేకపోయినా.. లాక్‌డౌన్ తర్వాత నిన్ను పచ్‌ఘనీలో కలుస్తాను అని తన పోస్టులో పేర్కొన్నారు.
జేన్ మారీ ఖాన్ అమీర్ ఖాన్ సోదరుడి కూతురు. ఆమె థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇరాకు జేన్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ కారణంగానే తాజా పోస్టును ఇరా పెట్టారు.
ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీలో నటిస్తున్నారు. ఈచిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఈ మూవీ రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











