‘మహాభారతం'పై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Aamir Khan Mahabharata Movie: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు చేసే ఆమిర్‌ఖాన్ పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకాడరు. పాత్ర కోసం తన బాడీని ఏ విధంగా కావాలంటే.. ఆ విధంగా మలుచుకుంటారు. అన్ని రకాల జోనర్ లలో నటించారు యాక్టర్ అమీర్ ఖాన్. అందుకే అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ పిలుస్తారు. తాజాగా మహాభారతం మూవీ పై అమీర్ ఖాన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
హీరో ఆమిర్ ఖాన్ 2022లో 'లాల్ సింగ్ చడ్డా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే.. మరో సినిమా చేయలేదు. ఆమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి నిర్మించిన తాజా చిత్రం 'లాపతా లేడీస్'. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కిరణ్ రావు దీనికి దర్శకత్వం వహించారు. 2025 ఆస్కార్ పోటీలకు లాపతా లేడీస్ మూవీ.. భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా అమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలోయ మాట్లాడుతూ.. 'మహాభారతం' ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఆ సినిమా విషయంలో తనపై ఎంతో బాధ్యత ఉందని, ప్రతి భారతీయుడు గర్వపడేలా మహా భారతం ను తెరకెక్కించాలని భావిస్తున్నానని తెలిపారు. ఈ మూవీ తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ, తనకు మహాభారతం పట్ల చాలా బాధ్యత ఉందనీ, దాంతో పాటు భయం కూడా ఉందన్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా భారీ స్థాయిలో మహా భారతం రూపొందించాలని అనుకుంటున్నానని తెలిపారు.
మహా భారతం అనేది ప్రతి భారతీయుల రక్తంలోనే ఉందనీ, కాబట్టి, ఈ ప్రాజెక్ట్ పై తనకు బాధ్యత పెరిగిందని అన్నారు. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నానని,, ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని బావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను హార్డ్ వర్క్ చేస్తున్నానని ఆమిర్ ఖాన్ చెప్పారు. మహాభారతం ప్రాజెక్ట్ ను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే అవకాశమున్నట్టు టాక్.

ఇదెలా ఉంటే.. భవిష్యత్తులో మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఉందనీ, కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహించాలని ఉందన్నారు. గొప్ప కథలను ప్రేక్షకులకు అందించాలనేది తన ఆలోచన అనీ, నిర్మాతగా మారినప్పటికీ నటుడిగానూ సినిమాల్లో నటిస్తానని తెలిపారు. ప్రస్తుతం రెండు, మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నాననీ, రానున్న రోజుల్లో సంవత్సరానికి కనీసం ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నానని అమిర్ ఖాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











