twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బులు ఎక్కువగా వస్తాయాని అలా చేస్తే.. పరిశ్రమకు ప్రమాదకరం: అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక అమీర్ ఖాన్ అయితే ఒక్కడే వివిధ భాషల్లో వేగంగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకులం ముందుకు రాబోతోంది. అయితే ఇటీవల చిత్ర పరిశ్రమకు కొందరు నిర్మాతలు డబ్బు కోసం ఆలోచిస్తున్న విధానం చాలా ప్రమాదకరమని ఎప్పటికైనా అది ఇండస్ట్రీ పై ప్రభావం చూపిస్తుంది అని అన్నారు.. ఆ వివరాలలోకి వెళితే..

    గ్రాండ్ రిలీజ్

    గ్రాండ్ రిలీజ్


    అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక భిన్నమైన పాయింట్ హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక ఆయన ఎంతో ఇష్టంగా చేసిన లాల్ సింగ్ చడ్డాలో కూడా ఒక లైఫ్ ఎమోషన్ ఉందట. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రత్యేకంగా సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రమోట్ చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే కొన్నిసార్లు ప్రముఖ హీరోలకు స్పెషల్ షో కూడా వేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు తెలుగులో సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే.

     మంచి పాజిటివ్ టాక్

    మంచి పాజిటివ్ టాక్

    అలాగే తమిళ చిత్రపరిశ్రమలో కూడా లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్న అమీర్ ఖాన్ కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి ప్రత్యేకంగా సినిమా కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ అయితే పెంచుతున్నారు. ఇక షోలు ప్రదర్శించిన ప్రతిసారి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తోందే.

    Recommended Video

    Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
    నెగిటివ్ ట్యాగ్ వైరల్

    నెగిటివ్ ట్యాగ్ వైరల్

    అయితే లాల్ సింగ్ చడ్డా సినిమాపై ఒక నెగిటివ్ ట్యాగ్ కూడా గత కొన్ని వారాలుగా వైరల్ అవుతొంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈ సినిమాను బాయికాట్ చేయాలి అని ఒక ట్యాగ్ ను అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఇండియాలో రక్షణ లేదు అని విదేశాలకు వెళ్లిపోవాలని ఉంది అంటూ గతంలో అమిర్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇండియా మీద గౌరవం లేనప్పుడు నీ సినిమా మేము ఎందుకు చూడాలి అంటూ మరి కొంతమంది బాయ్కాట్ ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

     సినిమాను చూడకూడదని..

    సినిమాను చూడకూడదని..

    అయితే తన సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయకూడదు అని ఆ విధమైన అభిప్రాయాలతో ఆలోచిస్తూ ఉండడం నా దురదృష్టం అంటూ అమీర్ ఇటీవల ఒక వివరణ ఇచ్చారు. తనకు భారతదేశం అంటే ఎల్లప్పుడూ కూడా గౌరవమే అని చెప్పినా కూడా ఈ నెగటివ్ ట్యాగ్స్ మాత్రం అసలు తగ్గడం లేదు. మరొకవైపు గతంలో కరీనాకపూర్ అలాగే సినిమా రచయిత చేసిన కొన్ని యాంటీ హిందూ కామెంట్స్ పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను చూడకూడదు అని ప్రచారాలు మొదలుపెట్టారు.

    అది ప్రమాదకరం

    అది ప్రమాదకరం

    ఇక రీసెంట్ గా చిత్ర పరిశ్రమలో ఒక విధానం చాలా ప్రభావం చూపిస్తోంది అని ముఖ్యంగా సినిమాలను థియేటర్లో ఎక్కువ రోజులు ఉండనివ్వకుండా ఓటీటీలో చాలా తొందరగా విడుదల చేస్తూ ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని డబ్బుల కోసం ఆశపడి ఓటీటీ కొందరు నిర్మాతలు త్వరగా విడుదల చేస్తున్నరాని అయితే చిత్రపరిశ్రమకు ఎప్పటికైనా అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని అమీర్ ఖాన్ తెలియజేసాడు.

    English summary
    Aamir khan shocking comments on new movies advance released in OTT
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X