హాట్ న్యూస్: రూ. 1000 కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం!
ఇప్పటి వరకు ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ ఏది అంటే మొన్నటి వరకు బాహుబలి... ఇపుడు '2.0'. అయితే వీటన్నింటినీ మించి పోయేలా త్వరలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూ. 1000 కోట్ల బడ్జెట్‍తో 'మహాభారతం' తెరకెక్కించబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' విడుదల తర్వాత అమీర్ ఖాన్ 'మహాభారతం'పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన మరికొందరితో కలిసి అమెరికా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఇంటర్నేషనల్ నిపుణులతో కలిసి ప్రాజెక్టు ప్లానింగ్ గురించి చర్చించబోతున్నట్లు సమాచారం.

మొత్తం 7 భాగాలుగా
ఇంత భారీ బడ్జెట్ మూవీ కేవలం రెండు మూడు భాగాలకు పరిమితం కాదని తెలుస్తోంది. మొత్తం 7 భాగాలుగా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. వీటిని డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్లతో చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

కృష్ణుడి పాత్రలో
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడి పాత్ర చేయాలని డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ పాత్ర పోషించడం ద్వారా అన్ని పార్టుల్లో అమీర్ ఖాన్ భాగం అయ్యే అవకాశం దక్కుతుంది. ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోని పెద్ద పెద్ద స్టార్లను ఇందులో భాగం చేయబోతున్నారట.

ద్రౌపదిగా దీపిక?
ఈ మైథలాజికల్ డ్రామాలో దీపిక పదుకొనెను తీసుకోవాలని అమీర్ ఖాన్ భావించారని, ఆమెతో ద్రౌపది పాత్ర వేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ ఫైనల్ అయితే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్
‘మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ... గతంలో ‘సీక్రెట్ సూపర్ స్టార్' ప్రమోషన్ల సమయంలోనే అమీర్ ఖాన్ ప్రకటించారు. ఇది తన జీవితంలో దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు తీసుకుంటనే ఓ భయం కూడా తనను వెంటాడుతున్నట్లు తెలిపారు.

ఆ రెండు ఇష్టమైన పాత్రలు
గతంలో ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... ‘మహాభారతం'లో తన ఫేవరెట్ క్యారెక్టర్ లార్డ్ కృష్ణ అని, అయితే తన ఫిజిక్ పరంగా ఆ పాత్ర నాకు సూటవుతుందో? లేదో? అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. యుద్ధంలో తన వాళ్లనే చంపే పరిస్థితి వచ్చినపుడు కృష్ణుడిని ప్రశ్నించే అర్జునుడి పాత్ర కూడా తన ఫేవరెట్ అని తెలిపారు.


Click it and Unblock the Notifications











