Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమీర్ ఖాన్ ఫర్ఫెక్షన్ అంటే అదే.. మరో ఛాలెంజింగ్ పాత్ర కోసం..
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా లాల్ సింగ్ ఛద్దా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు టామ్ హంక్స్ నటించిన పాత్రలో అమీర్ ఖాన్ కనిపించనున్నారు. తన జన్మదినం రోజున లాల్ సింగ్ ఛద్దా సినిమాను రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్, నవంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ మరో ఛాలెంజ్‌ను స్వీకరించినట్టు తాజా సమాచారం.
లాల్ సింగ్ ఛద్దా చిత్రంలో యువకుడి పాత్రలో కనిపించేందుకు 20 కేజీల బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం చాలా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నట్టు సమాచారం. కేవలం వెజిటేరియన్ కరీ, రోటిని మాత్రమే తీసుకొంటున్నారు. తన లుక్ ఫర్ఫెక్ట్గా ఉండేందుకు సెప్టెంబర్‌లో శిక్షణ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, క్రియేటివ్ అంశాలపైనా దృష్టిపెడుతున్నట్టు సమాచారం.
చాలాకాలంగా ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. అయినా వారు ఎవరికీ ఇవ్వలేదు. అమీర్ ఖాన్ తీసుకొంటున్న జాగ్రత్తలను, సినీ నిర్మాణంలో ఆయన ఫర్ఫెక్షన్ గురించి తెలుసుకొని హాలీవుడ్ నిర్మాతలు షాక్‌కు గురయ్యారు. అమీర్ ఖాన్ గత సినిమాల నిర్మాణం గురించి తెలుసుకొని హక్కులను ఇచ్చారు అని అమీర్ ఖాన్ సన్నిహితులు చెప్పారు.
సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాకు దర్శకత్వం వహించిన అద్వైత్ చందన్ ప్రస్తుతం లాల్ సింగ్ ఛద్దాకు డైరెక్షన్ చేస్తున్నాడు. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా 2020 క్రిస్మస్కు రిలీజ్ కానున్నది.