ఒకప్పుడు ఆమెను ఛీ కొట్టారు... ఇపుడు ఏకంగా అమీర్ ఖాన్ ట్వీట్ చేశారు!

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సోమవారం (మే 13) 38వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ ప్రత్యేకమైన రోజున తన భర్త డేనియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో కలిసి హ్యాపీగా గడిపారు. ఈ సందర్భంగా డినియల్ తన అందమైన భార్యను సెక్సియెస్ట్ అని పేర్కొంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

సన్నీ లియోన్‌కు మరో స్పెషల్ పర్సన్ నుంచి కూడా విషెస్ అందాయి. అతడు మరెవరో కాదు... బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. సన్నీని విష్ చేస్తూ అమీర్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీ, ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ నుంచి విషెస్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Aamir Khan tweet on Sunny Leones 38th birthday

డియర్ సన్నీ లియోన్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు... ఈరోజు నీకు ఎంతో గొప్పగా గడవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రత్యేకమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన కొత్తలో సన్నీ లియన్ ఇక్కడ చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంది. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆమెను చాలా నీచంగా చూశారు. అప్పట్లో కొందరు బాలీవుడ్ నటులు సైతం సన్నీతో నటిస్తే తమ స్థాయి తగ్గుతుందనే భయంతో ఉండేవారు.

కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో సక్సెస్ అయింది. అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ నుంచి పుట్టినరోజు విసెస్ రావడమే ఇందుకు నిదర్శనం. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం ఇపుడు సన్నీ లియోన్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X