తెలుగు గడ్డపై అడుగుపెట్టిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. భారీ సెక్యూరిటీతో అక్కడ షూటింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్త ద్వారా అమీర్ ఖాన్ సోషల్ మీడియాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. అయినప్పటికీ ఆ రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా మిస్టర్ పర్ఫెక్ట్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా బిగ్ హిట్ అందుకోవాలని అమీర్ ఖాన్ గట్టిగానే ప్లాన్ వేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే ఇటీవల మొదలైంది. చాలా రోజుల తర్వాత సెట్స్ పైకి వచ్చిన అమీర్ ఖాన్ గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేస్తున్నాడు.

సినిమాకు సంబంధించిన లోకేషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఆంధ్ర ప్రదేశ్ ను కూడా సెలెక్ట్ చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అందాలను కూడా సినిమాలో చూపించనున్న ట్లూ సమాచారం. ఇక అందులో భాగంగానే చిత్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టాడు. ఒక విధంగా చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ తెలుగు నేలపై అడుగు పెట్టాడు. నేడు కోనసీమలోని అల్లవరం, ఓడలరేవు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. కీలకమైన షెడ్యూల్లో అమీర్ ఖాన్ తో పాటు మరి కొంత మంది హిందీ నటులు కూడా పాల్గొనబోతున్నారు.

Aamir khan upcoming movie Laal Singh Chaddha shooting in ap

లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం వచ్చిన అమీర్ ఖాన్ కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్ లో బస చేశాడు. ఇక అమీర్ ఖాన్ బసచేసిన హోటల్ ప్రైవేట్ సెక్యూరిటీ ఆధీనంలో ఉంది. ఇక హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాపై వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో నాగ చైతన్య పాత్ర ఉంటుందని ఇప్పటికే విడుదలైన లొకేషన్స్ ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది. అసలైతే మొదట ఆ పాత్ర కోసం కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నీ అనుకున్నారు. కానీ ఆ నటుడు ఫిట్నెస్ విషయాల్లో పెద్దగా మార్పులు చేయకపోవడంతో అమీర్ ఖాన్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వచ్చింది.

మర్యాద పూర్వకంగానే డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదని కారణంతో విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక లాల్ సింగ్ చిత్రం సినిమా అనంతరం నాగ చైతన్య బాలీవుడ్ లో ఫుల్ బిజీ యాక్టర్ గా మారే అవకాశం ఉందని కూడా టాక్ వస్తోంది. ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో అతనిని సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ మీడియాలో కూడా నిరంతరం నాగ చైతన్యకు సంబంధించిన అనేక రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి నాగ చైతన్య ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X