Who is Nupur Shikhare? అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్‌ను పెళ్లాడింది ఎవరు? న్యూడ్ ఫోటోషూట్‌తో సంచలనం

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఎట్టకేలకు వివాహం చేసుకొన్నది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న ఈ స్టార్ డాటర్.. తనకు నచ్చిన ప్రియుడిని పెళ్లాడింది. దాంతో గత కొద్దికాలంగా పెళ్లి వార్తలు, గాసిప్స్ గురించి రకరకాలుగా వినిపించిన కథనాలకు తెరపడింది. ఇరా ఖాన్ పెళ్లాడిన వ్యక్తి ఎవరు? అతడితో ఇరా ఖాన్ అఫైర్, అమీర్ ఖాన్ స్పందన గురించిన వివరాల్లోకి వెళితే..

అమీర్ ఖాన్ బ్యాక్‌గ్రౌండ్ తప్పా సినిమా పరిశ్రమతో పెద్దగా కనెక్షన్ లేని ఇరా ఖాన్ పేజ్ 3 సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తూ వస్తున్నది. అయితే కొద్ది సంవత్సరాలుగా నూపూర్ శిఖారేతో సహజీవనం చూస్తూ వచ్చింది. ఇరు కుటుంబాల అనుమతితో నిరాడంబరంగా ముంబైలోని ఓ కోర్టులో బుధవారం అంటే జనవరి 3వ తేదీన వివాహం చేసుకొన్నది. ఈ పెళ్లికి అమీర్ ఖాన్ కుటుంబం, శిఖారే ఫ్యామిలీ వర్గీయులు మాత్రమే హాజరయ్యారు.

Aamir Khans daughter Ira Khan tie the knot with Health Trainer Nupur Shikhare

అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్‌ను వివాహం చేసుకొన్న నూపూర్ శిఖారే విషయానికి వస్తే.. యంగ్ ఏజ్‌లో అథ్లేట్‌గా రాణించాడు. ఆ తర్వాత ఫిజికల్ ట్రైనర్‌ వృత్తిలో స్థిరపడ్డారు. పూణేకు చెందిన నూపూర్ ముందుగా సుస్మిత సేన్ లాంటి సినీ ప్రముఖులకు ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇరా ఖాన్‌తో జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది.

డేటింగ్ సమయంలో ఇరా ఖాన్, నూపూర్ ఇద్దరు చేసిన లీలలు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. వారిద్దరి శృంగార విన్యాసాలు, రొమాంటిక్ టూర్లు అందర్ని ఆకట్టుకొన్నాయి. ఇన్స్‌టాగ్రామ్‌లో వారిద్దరి రొమాన్స్ ఓ దశలో పీక్స్‌కు చేరింది. దాంతో ముంబైలో వారిద్దరి బంధంపైౌ ప్రత్యేకమైన దృష్టిపడింది.

Aamir Khans daughter Ira Khan tie the knot with Health Trainer Nupur Shikhare

అయితే ఇరా ఖాన్‌తో అఫైర్‌కు ముందే నూపూర్ షిఖారే ఓ సంచలనంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన నగ్నంగా పరిగెత్తుతూ, జంపింగ్స్ చేస్తూ చేసిన ఫోటోషూట్ వివాదాస్పదంగా మారింది. 2019 లో జరిగిన ఈ ఫోటోషూట్‌కు ఊహించని స్పందన, కామెంట్లు వచ్చాయి.

ఇదిలా ఉండగా, అత్యంత సాధారణ స్థితిలో జరిగిన ఇరా ఖాన్ వివాహం తర్వాత ఉదయ్‌పూర్‌లో ఇరు కుటుంబాల సభ్యులకు విందు ఏర్పాటు చేసే పనిలో అమీర్ ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత తన స్నేహితుల కోసం కూడా బాలీవుడ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X