ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. సల్మాన్, షారుక్ డుమ్మా ఎందుకంటే?

బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యారు. ముంబైలొని తన నివాసంలో అత్యంత నిరాడంబరంగా తమ కుటుంబ సభ్యులు, ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో గౌరీ స్ప్రాట్‌ను ముస్లిం మత సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకొన్నారు. పెళ్లి తంతులో అమీర్ అత్యంత ఉత్సాహంగా కనిపించారు. పెళ్లి కార్యక్రమం తర్వాత తన మూడో భార్య గౌరీతో డ్యాన్సులు వేస్తూ ఆనందంగా తన వివాహాన్ని సెలబ్రేట్ చేసుకొన్నారు. అయితే ఈ పెళ్లికి ఎవరెవరూ హాజరయ్యారు? ఎవరు గైర్హాజరు అయ్యారంటే?

బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావుతో విడాకుల తర్వాత అమీర్ ఖాన్ చాలా కాలం ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత తన చిరకాల స్నేహితురాలు, సినిమా పరిశ్రమలో డిజైనర్‌గా రాణిస్తున్న ఆంగ్లో ఇండియన్ గౌరీ స్ప్రాట్‌తో మరోసారి ప్రేమలో పడ్డారు. అయితే వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని ముంబైలో జరిగిన కొన్ని ఈవెంట్స్‌లో కనిపించడం భారీ చర్చకు దారి తీసింది. అయితే వారిద్దరి బంధం గురించి అడిగిన ప్రశ్నకు తాము మానసికంగా భార్యభర్తల ఎప్పుడో అయ్యాం అని ఆయన సమాధానం ఇచ్చారు. చివరకు ముంబైలోని తన నివాసంలో గౌరీని మూడో భార్యగా అధికారికంగా ప్రకటించారు.

Aamir Khan s Wedding

అయితే ఈ వివాహానికి తన మొదటి భార్య రీనా దత్తాను, రెండో భార్య కిరణ్ రావును సాదరంగా ఆహ్వానించారు. తన పెళ్లికి హాజరైన ఇద్దరు మాజీ భార్యలను ఇంటి గుమ్మం నుంచి లోపలికి ప్రేమతో స్వయంగా ఆహ్వానించారు. వారితో కలిసి ఆయన ఫోటోలు దిగారు. తన మూడో భార్యతో కలిసి మాజీ భార్యలను ఒకే ఫ్రేమ్‌లో బంధించేలా చేశాడు. ఓ దశలో కిరణ్ రావుకు ముద్దుల పెడుతూ కనిపించారు.

అయితే ఈ వివాహానికి అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. శివసేన అధినేత రాజ్ థాక్రే, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హాజరైనట్టు స్పష్టమైంది. అయితే ఈ వివాహానికి అమీర్ అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ గైర్హాజరు అయ్యారు. కానీ తన మిత్రుడికి ముందుస్తుగా వివాహ శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. అయితే ఈ పెళ్లికి వారిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం షూటింగ్‌లు, ఇతర షెడ్యూల్ కారణంగా హాజరు కాలేదని తెలిసింది.

అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. 1973 సంవత్సరంలో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆతర్వాత ఖయామత్ సే ఖయామత్ మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత దిల్, రాజా హిందూస్థానీ, లగాన్, దిల్ చాహ్తా హై, పీకే, దంగల్, తారే జమీన్ పర్, సితారే జమీన్ పర్ లాంటి సినిమాలో భారీ విజయాలు అందుకొన్నారు. ఆయన తమిళంలో రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం 3 ఇడియట్స్, బట్వారా 1947 చిత్రాల్లో నటిస్తున్నారు.

Read more about: aamir khan Gauri Spratt bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X