Aaradhya Bachchan: హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యా రాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతుల కుమార్తె ఆరాధ్య ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఏంటీ అంత చిన్న పిల్ల హైకోర్టును ఎందుకు ఆశ్రయించింది, ఏమైంది అనుకుంటున్నారా! ఆరాధ్య బచ్చన్.. తన ఆరోగ్యం, జీవితం గురించి తప్పుగా వార్తలు రాస్తూ కాసులు సంపాదించుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించింది.
11 ఏళ్ల వయసు కల్గిన మైనర్ బాలిక ఆరాధ్య తన గురించి, తన ఆరోగ్యం గురించి.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు వార్తలను ప్రసారం చేశాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. నిజానికి ఆరాధ్య బచ్చన్ పై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పని గట్టుకొని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటాయి.

అయితే ఆ వీడియోలన్నింటిని డీ లిస్ట్ చేసి డియాక్టివేట్ చేయమని ధర్మాసనాన్ని తన పిటిషన్ ద్వారా కోరింది. గూగుల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన గ్రీవెన్స్ సెల్ కూడా ఈ కేసులో పార్టీలుగా మారాయి. ఈ విషయంపై బచ్చన్ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కానీ బాబ్ బిస్వాస్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్ని అభిషేక్ బచ్చన్ తన కూతురుపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు. ఇది ఏమాత్రం అంగీకార యోగ్యమైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న పిల్లపై ఇలాంటి ట్రోల్స్ దారుణం అని చెప్పాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చుగానీ.. తన కూతురిని అనడానికి ఎవరికీ ఎలాంటి హక్కు లేదని చాలా గట్టిగానే చెప్పాడు.
2007 ఏప్రిల్ 20వ తేదీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి. ముందుగా అభిషేక్ యే ఐశ్వర్యా రాయ్ కు ప్రపోజ్ చేసినట్లు స్వయంగా ఆమే తెలిపారు. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా... 2011లో వారికి ఆరాధ్య బచ్చన్ పుట్టింది. గత కొంత కాలంగా వీరి కూతురు ఆరోగ్యం గురించి చాలా యూట్యూబ్ ఛానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











