‘రాముడు’గా అమీర్ ఖాన్ కొడుకు, ‘సీత’గా ఐశ్వర్యరాయ్ కూతురు!

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య..... అమీర్ ఖాన్, కిరణ్ రావ్ కుమారు ఆజాద్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒకరు సీత పాత్రలో, మరొకరు రాముడి పాత్రలో అదరగొట్టారు. అయితే ఇదంతా సినిమాలకు సంబంధించిన వ్యవహారం అయితే కాదు.

తమ పాఠశాలలో జరిగిన ఓ ఈవెంటులో భాగంగా ఆరాధ్య, ఆజాద్ ఓ నాటకం ప్రదర్శించారు. ఇందులో రాముడి పాత్రలో ఆజాద్, సీత పాత్రలో ఆరాధ్య నటించారు. వీరి నాటకానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆరాధ్య, ఆజాద్ ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఈ సెలబ్రిటీ కిడ్స్ మధ్య స్నేహం కూడా ఉంది. ఇప్పటి నుంచే వీరే నటనపై ఆసక్తి చూపడం చూస్తుంటే భవిష్యత్తులో పెద్ద యాక్టర్స్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Aaradhya Bachchan Playing as Sitha and Azad Rao Khan as Rama

ఈ పిల్లల సంగతి పక్కన పెడితే... ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి 'గులాబ్ జామున్' అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X