అబ్దుల్ కలాం బయోపిక్ కోసం... ఆ స్టార్ హీరోతో చర్చలు?
ఇండియన్ సినీ పరిశ్రమలో కొంతకాలంగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితాలపై సినిమాలు రాగా... త్వరలో ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ రాబోతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ త్వరలో అబ్దుల్ కలాం బయోపిక్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వినగానే అనిల్ కపూర్ చాలా ఎగ్జైట్ అయ్యాడని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.

రాజ్ చెంగప్ప రాసిన అబ్దుల్ కలాం బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నారు. ఆల్రెడీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలోనే సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి వచ్చే జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.
నిరు పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలా దేశం గర్వించ దగ్గ సైంటిస్టుగా ఎలా ఎదిగారు, భారత దేశాన్ని అణుశక్తి దేశంగా మార్చడం వెనక ఆయన చేసిన కృషి ఏమిటి? లాంటివి ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉంది. అబ్దుల్ కలాం బాల్యం నుంచి సినిమా మొదలై ఆయన రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంతో ముగిసేలా స్కిప్టు సిద్ధం చేశారని టాక్.


Click it and Unblock the Notifications











