రామ మందిరం ప్రారంభానికి గొడ్డు మాంసం తినేవారా? రణబీర్, అలియపై సింగర్ ఎటాక్

Abhijeet Bhattacharya on Ranbir Kapoor: బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఆయన తన సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. బాలీవుడ్ సెలబ్రెటీలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన కొంతకాలం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. తాజాగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌పై కూడా పరోక్షంగా కామెంట్స్ చేస్తూ మరో వివాదానికి తెర తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా వంటి బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి రణ్‌బీర్ కపూర్ హాజరుకావడంపై గాయకుడు అభిజీత్ భట్టాచార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడు గొడ్డు మాంసం తినే వ్యక్తిని ఆహ్వానించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Abhijeet Bhattacharya Blast on Ranbir Kapoor presence at Ram Mandir inauguration in ayodhya

ఇటీవల బాలీవుడ్ తికానా ఇంటర్వ్యూలో సింగర్ అభిజీత్ మాట్లాడుతూ... బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ మందిరం ప్రారంభోత్సవానికి గోమాంసం తినే వ్యక్తిని ఆహ్వానించారు. మేము ఆవు తల్లి అని భావిస్తాం అని ఆయన అన్నారు. అభిజీత్ చేసిన ఈ వ్యాఖ్య మరోసారి వివాదాన్ని సృష్టించింది. ఆయన సంచలన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది.

అలాగే.. రణబీర్ కపూర్ హీరోగా అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'బేషరం' సినిమాపై కూడా సింగర్ కామెంట్స్ చేశారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అభిజీత్ తన అభిప్రాయం చేస్తూ.. దిల్ కా జో హాల్ హై అనే పాట పాడాడు. ఆ పాటకు ఆదరణ లేకపోయినా, తన గాత్రం చిరస్మరణీయంగా ఉందని వ్యాఖ్యానించారు. గాయకులకు రాయల్టీ ఇవ్వడం లేదని, పాట సంగీత సంస్థకు చెందినదని, దాని ఆత్మ గాయకుడిదని ఉద్ఘాటించారు.

Abhijeet Bhattacharya Blast on Ranbir Kapoor presence at Ram Mandir inauguration in ayodhya

ఇంతకీ రణబీర్ కపూర్ బీఫ్ వివాదం ఏంటి?

రణబీర్ కపూర్ 2011లో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో గొడ్డు మాంసం తినడం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2022లో 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రచార కార్యక్రమంలో కూడ రణబీర్ కపూర్ మళ్లీ అలాంటి స్టేట్‌మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కారణంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలోకి రాకుండా రణబీర్, అతని భార్య అలియా భట్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సింగర్ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X