‘సల్మాన్ ఖాన్ నపుంసకుడు.. పిల్లల్ని పుట్టించే సామర్థ్యం లేనివాడు’
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దబంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం జోరందుకొన్నది. కొద్దికాలంగా సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లో అభినవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అభినవ్ ఆరోపణలపై ఇటీవల సల్మాన్ ఖాన్ కూడా బిగ్‌బాస్ షోలో స్పందించాడు. దాంతో తాజాగా అభినవ్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టు కనిపిస్తున్నది. అయితే సల్మాన్ ఖాన్, అభినవ్ మధ్య వివాదానికి, మాటల యుద్ధానికి కారణం ఏమిటి? సల్లూ భాయ్ చేసిన కామెంట్స్‌కు అభినవ్ ఇచ్చిన కౌంటర్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
నాపై అలాంటి కక్ష
దబంగ్ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, ఆయన టీమ్ మెంబర్స్ జోక్యం విపరీతంగా ఉండేది. తనకు రావాల్సిన క్రెడిట్‌ను ఇవ్వకుండా నాపై కక్ష కట్టాడు. సల్మాన్ ఖాన్‌కు యాక్టింగ్ రాదు. షూటింగ్‌కు కూడా లేటుగా వస్తాడు. యాక్టర్ కంటే.. గల్లీ రౌడీగా ఎక్కువగా బిహేవ్ చేస్తాడు అని అభినవ్ కశ్యప్ సంచలన ఆరోపణలు చేశాడు.

ఆ డైరెక్టర్‌కు పనిలేకపోవడం వల్లే
అయితే అభినవ్ చేసిన కామెంట్స్‌పై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. దబంగ్ డైరెక్టర్‌కు చేతిలో పని లేదు. అందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. నాపై బురద జల్లకుండా ఏదైనా పని చేసుకొంటే మంచిది అంటూ సల్మాన్ కౌంటర్ ఇచ్చాడు. సల్మాన్ ఈ సందర్భంగా దక్షిణాది దర్శకుడు మురగదాస్‌పై కూడా సెటైర్లు వేయడం మీడియాలో హైలెట్ అయింది.
దబంగ్ కాదు.. చెక్కా
అయితే సల్మాన్ కామెంట్స్‌పై అభినవ్ స్పందిస్తూ.. ఆయన థర్డ్ క్లాస్ పర్సన్. చెత్త వెధవ. ఆయన నపుంసకుడు. ఆయన దబంగ్ కాదు.. చెక్కా.. ఓ పిల్లాడిని పుట్టించే సామర్థ్యం లేదు. నాకు నీతులు చెబుతున్నాడు. నాకు పని లేకపోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. నన్ను పనిచేసుకోమని బిగ్‌బాస్ వేదికపై నుంచి సలహా ఇస్తున్నాడు. నేను ఎందుకు విమర్శిస్తున్నానో దానికి జవాబు చెప్పకుండా ఇతరులు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయన డిసైడ్ చేస్తున్నాడు అని అభినవ్ కశ్యప్ అన్నాడు.

డ్రగ్స్ కల్చర్ అంటూ
అరకిలో టాల్కమ్ పౌడర్ (డ్రగ్స్) ముక్కులో వేసుకొంటాడేమో. దాని ప్రభావం వల్లే అలా మాట్లాడుతున్నాడేమో. ఖాన్ హీరోలు ఇచ్చే పార్టీలలో పాల్గొన్నాను. వారి పార్టీలలో ఇలాంటివి బాగా జరుగుతుంటాయి. వాటిని నేను సైలెంట్‌గా గమనిస్తూ ఉండేవాడిని. నేను వారితో పార్టీలకు దూరంగా ఉండటంతో డ్రైవర్‌కు చెప్పి ఇంటిలో వదిలిపెట్టమని అనే వాళ్లు. వాళ్ల బ్యాచ్‌లో నేను చేరకపోవడం వల్లే ఈ రోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి భయపడటం లేదు అని అభినవ్ కశ్యప్ అన్నాడు.
నన్ను చంపిస్తాడేమో..
నాకు పనిలేకపోవడం వల్లే ఇలా కామెంట్స్ చేస్తున్నాని అనడం సరికాదు. సల్మాన్ ఖాన్‌లోని చెడు కోణాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఇలా చేయడం వల్ల నన్ను చంపిస్తాడేమో. అయినా నేను భయపడను. నేను ఎంత భయపడుతానో.. ఆయన, వారి కుటుంబం కూడా అంతే భయపడుతుంది. ఆయన కుటుంబం చాలా పెద్దది. నన్ను పనిచేసుకోమని చెప్పడం కాదు.. ఆయన పని వెతుక్కోమని చెబుతున్నాను అని అభినవ్ కశ్యప్ ఘాటుగా స్పందించాడు.


Click it and Unblock the Notifications











