‘షారుక్ గురించి నోరు తెరిచి గుట్టువిప్పితే.. కాపురాలు, కుటుంబాలు కూలిపోతాయి’
బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది నెలలుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ఉవ్వెత్తున లేస్తున్న ఆయన ఇటీవల షారుక్ ఖాన్ టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. షారుక్, అమీర్, సల్మాన్ ఆలోచన తీరు ఒకటేలా ఉంటుంంది. వారి భావజాలం కూడా ఒకేలా ఉంటుంది అని ఆయన అన్నారు. తాను నోరు విప్పితే షారుక్ ఖాన్ జీవితం తారుమారు అవుతుందని సంచలన ఆరోపణలు చేశాడు. అభినవ్ కశ్యప్ తాజా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే?
అభినవ్ కశ్యప్ విషయానికి వస్తే.. జంగ్ అనే సినిమాతో 2000 సంవత్సరంలో హిందీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 2010 సంవత్సరంలో సల్మాన్ ఖాన్‌తో దంబంగ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో విభేదాలు తలెత్తాయి. వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొన్నారు. తాజాగా అభినవ్ కశ్యప్ తనపై చేస్తున్న ఆరోపణలపై ఏకంగా బిగ్‌బాస్ వేదికపై కొన్ని విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ..

హిందీ సినిమా పరిశ్రమలో రకరకాల అపోహాలు ఉన్నాయి. హీరో పేరు మీదే సినిమా నడుస్తుంది. హీరో వల్లనే సినిమా ఆడుతుంది. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్‌పై తోసేస్తారు. దర్శకులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. వీళ్ల మానసిక ప్రవర్తన చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను షారుక్ ఖాన్‌తో చాలా క్లోజ్‌గా పనిచేశాను. అమీర్ ఖాన్‌తో కలిసి వర్క్ చేశాను. సల్మాన్, షారుక్, అమీర్ ఆలోచించే విధానం ఒకేలా ఉంటుంది అని దర్శకుడు అభినవ్ కశ్యప్ ఆరోపణలు చేశారు.
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. గుండాయిజం చేస్తాడు. మాట్లాడితే బూతులే నోటి నుంచి వస్తాయి. కానీ షారుక్ అలాంటి వ్యక్తి కాదు. కానీ ఇతరుల ఐడియాలను లాగేసుకొనే తత్వం ఆయనది. నేను ఓ సినిమా కథ చెప్పాను. కానీ ఆ సినిమాను వర్కవుట్ కాలేదు. ఎందుకంటే రెడ్ చిల్లీస్ బ్యానర్‌లో సినిమా నిర్మిస్తానని అన్నాడు. దాని వల్ల ఆ సినిమా ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. కానీ నాకు అది నచ్చలేదు. నీవు యాక్టర్‌వి. నీ రెమ్యునరేషన్ తీసుకొని నటించమని అన్నాను అని అభినవ్ కశ్యప్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ మాదిరిగా షారుక్ దురుసుగా ఉండడు.. బూతులు మాట్లాడడు. కానీ ముఖం ముందు ఒక మాట, వెనుక మరో మాట మాట్లాడుతాడు. బెదిరింపులకు పాల్పడుతాడు. షారుక్ ఖాన్ గురించి నాకు అంతా తెలుసు. ఆయన గురించి నేను నోరు తెరిస్తే.. ఆయన కాపురం మాత్రమే కాదు చాలా మంది జీవితాలు కూలిపోతాయి అని అభినవ్ కశ్యప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.


Click it and Unblock the Notifications











