ఆ సినిమా ప్లాప్.. మిగతా ప్రాజెక్టుల నుంచి కూడా తీసేశారు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో నిలదొక్కుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక మరికొందరు ఊహించని విదంగా డిజాస్టర్స్ ఎదుర్కొని సాధారణ నటులుగా కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ స్టార్ హీరో అవ్వగలడని ఎంట్రీకి ముందు ఎన్నో రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ అతన్ని హిందీ ఆడియెన్స్ ఏ విధంగాను యాక్సెప్ట్ చేయలేకపోయారు.
యాక్షన్, అడ్వెంచర్, మాస్.. అంటూ బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఇక అతని కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ద్రోణ ఒకటి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమాతోనే అభిషేక్ మార్కెట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఆ సినిమాను అమితాబ్ బచ్చన్ మరొక నిర్మాతతో కలిసి దాదాపు 45కోట్లతో నిర్మించారు. కానీ సినిమాకు 15కోట్లు కూడా తిరిగి రాలేదట.

అయితే ఇటీవల ఆ సినిమాపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అభిషేక్ ఎవరు ఉహీంచని విధంగా సమాధానం ఇచ్చారు. ఆ సినిమా తరువాత మీకు వేరే సినిమాల్లో అవకాశం ఎలా వచ్చిందని అడుగగా అభిషేక్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ''ద్రోణ సినిమా తరువాత నాకు పెద్దగా ఆఫర్స్ రాలేవు. అంతకుముందు ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా నన్ను తీసేశారు.
ఆ తరువాత ఛాన్సులు దక్కించుకోవడమే చాలా కష్టంగా మారింది. మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే వరకు ఎలాంటి సపోర్ట్ లేకుండా మనమే కష్టపడాలి. జీవితంలో ఒంటరిగా పోరాడడం అలవాటు చేసుకోవాలని నేర్చుకున్నాను.." అని అభిషేక్ సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











