ఐష్ తో రొమాంటిక్ డేట్ డిజాస్టర్..మగాళ్ళారా అలా చేయొద్దంటున్న అభిషేక్!
బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణాలు నడిపిన ఐశ్వర్య రాయ్ చివరికి అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ ఏప్రిల్ 20, 2007న ఒక్కటయ్యారు. దాదాపు మూడేళ్ల తరువాత వారు తమ జీవితాల్లోకి కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను నవంబర్ 16, 2011న స్వాగతించారు. ఇక అభిషేక్ తన పాత ఇంటర్వ్యూలో తన డిజాస్టర్ డేట్ గురించి వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

చివరికి అభిషేక్ తో
ముందు సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఐష్ ఆ ప్రేమ కథకు బ్రేకులు వేసి వివేక్ ఒబెరాయ్ తో కొంత కాలం ప్రేమలో గడిపింది. అలా చివరికి అభిషేక్ ను వివాహం చేసుకుంది. అయితే అభిషేక్ బచ్చన్ కు ప్రేమకథలు లేవు కానీ, నిజానికి ఆయనకు ముందే కరిష్మా కపూర్ తో నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థం అయ్యాక బ్రేకప్ అయ్యారు. ఆ తరువాత అభిషేక్ - ఐష్ ప్రేమలో పడ్డారు.

అది డిజాస్టర్
ఇక ఒక త్రోబాక్ ఇంటర్వ్యూలో, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య తమ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవులకు వెళ్ళినప్పుడు, శృంగారభరితంగా కాకుండా, అది పూర్తి డిజాస్టర్ గా మారిందని వెల్లడించారు. అభిషేక్ బీచ్ లో రొమాంటిక్ డిన్నర్ డేట్ కోసం వెళుతున్నట్లు గుర్తుచేసుకున్నాడు, కానీ గాలి కొవ్వొత్తులను ఆర్పివేసిందని, గాలి కారణంగా ఆహారంలో ఇసుక కూడా పడిందని, అందుకే ఏది తిందామన్నా చెత్త లాగా రుచించింది అని అన్నారు.

మగాళ్ళూ ప్రయత్నించవద్దు
దీనిని ప్రయత్నించవద్దని అభిషేక్ మగాళ్ళకు సూచించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, అభిషేక్ ఐశ్వర్యతో ప్రేమలో పడటం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆర్జే సిద్ధార్థ్ కన్నన్ తో మాట్లాడుతూ, "మేము చాలా కాలం స్నేహితులుగా ఉన్నాము. నేను పనిచేసిన మొదటి సినిమా సహనటులలో ఐశ్వర్య ఒకరని అన్నారు..

ప్రపంచం అంతా కలిసి
సాంకేతికంగా మా మొదటి సినిమా ధై అక్షర్ ప్రేమ్ కే అని చెప్పుకొచ్చారు ఆయన, నేను రెఫ్యూజీని పూర్తి చేసిన వెంటనే రెండో చిత్రం షూటింగ్ ప్రారంభించాను కాబట్టి ఆమె ప్రియమైన స్నేహితురాలిగా ఉండేదని అన్నారు. ఆ తర్వాత కూడా మేము చాలా చిత్రాల్లో కలిసి పనిచేశామని అన్నారు. ఇక ఈ ప్రపంచం అంతా కలిసి మమ్మల్ని కలపడానికి కుట్ర చేసిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించాడు.

పెళ్లిచేసుకోమని అభిమాని అంటే
ఇక నిజానికి ఓ అభిమాని అభిషేక్ ముందే ఐశ్వర్యకు ఒకానొక సమయంలో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. దానికి అభిషేక్ బచ్చన్ రియాక్షన్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 2010లో అభిషేక్ తో పాటు ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్ కు హాజరయింది, ఆ సమయంలో భర్తతో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే ఓ అభిమాని.. ఐశ్వర్యను ఉద్దేశిస్తూ, 'నన్ను పెళ్లి చేసుకో ఐశ్వర్య' అనే ప్లకార్డు ప్రదర్శించారు. అది చూసి అభిషేక్ ఆమె నన్ను పెళ్లి చేసుకుంది మాన్' అంటూ ఆసక్తికరంగా స్పందించారు.


Click it and Unblock the Notifications











