ఐశ్వర్యతో బ్రేకప్ పై హింట్ ఇచ్చిన అభిషేక్.. విడాకుల పోస్టుపై చోటా బచ్చన్ క్లారిటీ
సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైన విషయంగా మారిపోతోంది. సుదీర్ఘకాలం ప్రేమించడమో , డేటింగ్ చేయడమో చేసి.. తర్వాత పెళ్లి చేసుకోవడం , నాలుగు రోజులకే అభిప్రాయ భేదాలొచ్చాయంటూ విడిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుండటం దురదృష్టకరం. లక్షలాది మంది అభిమానించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు.
సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు ఈ లిస్టులో ఎక్కువగా ఉంటున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ హర్డిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిచ్ దంపతులు తమ వైవాహిక బంధానికి తెరదించారు.
చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తన భార్య సినీ నటి మంజు పిళ్లైతో విడాకులు తీసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో దివంగత రాజ్ కుమార్ కుటుంబానికి చెందిన యువరాజ్ కుమార్‌తో హీరోయిన్ సప్తమి గౌడ ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు శాండిల్‌వుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కాస్తా యువరాజ్ భార్య శ్రీదేవికి తెలియడంతో ఆమె తనను భర్త వేధిస్తున్నాడంటూ విడాకులు కోరింది. దీనికి కౌంటర్‌గా యువరాజ్ సైతం.. భార్య తనను వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాల్సిందిగా ఫ్యామిలీ కోర్ట్ ను ఆశ్రయించారు. వీరే కాదు.. ఇంకా ఎంతోమంది సెలబ్రెటీ కపుల్స్ విడాకులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇకపోతే.. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్దినెలలుగా ప్రచారం జరుగుతోంది. కానీ వీటిపై వీరిద్దరూ స్పందించలేదు. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల పెళ్లికి సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు. ఈ పెళ్లికి ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్‌తో కాకుండా కుమార్తె ఆరాధ్యతో అటెండ్ కావడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ హీనా ఖండేల్వాల్ ఇన్‌స్టాలో పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ కొట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. ఆల్రెడీ అభిషేక్ - ఐశ్వర్యలకు విడాకులు మంజూరై సెపరేట్ అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. తాము కలిసే ఉన్నామని చెప్పేలా ఐష్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇంతకీ అభిషేక్ లైక్ కొట్టిన ఆ పోస్ట్‌లో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రేమ కష్టంగా మారినప్పుడు, విడాకులు తీసుకోవడం సులభం కాదు అని.. కొన్ని సార్లు మనం కోరుకున్నట్లుగా జీవితం సాగదని.. దశాబ్ధాల పాటు కలిసి ఉండి, సెపరేట్ అయిన తర్వాత ఎలా ఉంటారు. బంధాన్ని ఎందుకు తెంచుకోవాలనుకుంటున్నారు.. 50 ఏళ్ల వయసు దాటినవారు కూడా ప్రపంచవ్యాప్తంగా విడిపోతున్నారని, ఇందుకు కారణాలు చిత్ర విచిత్రంగా ఉంటాయని హీనా పోస్ట్ పెట్టారు. దీనికే అభిషేక్ ఇప్పుడు లైక్ కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాగా.. ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లు 2007లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2011లో ఆరాధ్య పుట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఈ జోడీ మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి బాలీవుడ్‌లోని పెద్ద కుటుంబంలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా లేక అవి కేవలం పుకార్లేనా అన్నది తెలియాల్సి ఉంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలకు తెరపడవు.


Click it and Unblock the Notifications











