Divorce: ఐశ్వర్యరాయ్‌తో విడాకులు.. నిమ్రత్ కౌర్‌తో రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్‌లో స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకుల విషయం గురించిన హాట్ టాపిక్ మరోకటి లేదనే విషయం కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా వార్తలు వస్తున్నాయి. అవన్నీ డెయిలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పో రైటో అనే విషయంపై ఆ ఇద్దరు తెర దించకుండా సీరియల్ ఎపిసోడ్‌లా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ రెండో పెళ్లి గురించి తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య రాయ్ వైవాహిక సంబంధాలు అంతంత మాత్రమే. వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అమితాబ్ అధికారిక నివాసం జల్సా నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి అనే వార్త మీడియాలో కనిపించింది.

Abhishek Bachchan reacted on divorce rumours with Aishwarya Rai and Remarriage gossips With Nimrat Kaur in Social media

ఇక ఐశ్వర్య, అభిషేక్ దాంపత్య జీవితంలో కలతలు రావడానికి ఓ డాక్టర్ కారణం.. ఐశ్వర్యకు ఓ డాక్టర్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణంగానే వారిద్దరూ విడిపోతున్నారు అనే వార్త సంచలనం రేపింది. ఆ వార్తకు సంబంధించిన వేడి తగ్గక ముందే అభిషేక్ బచ్చన్.. నటి నిమ్రత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరి మధ్య సపరేషన్‌కు కారణం అంటూ మరో వార్త బయటకు వచ్చింది.

ఇలాంటి వార్తలు గందరగోళం మధ్య దస్వీ మూవీలో కలిసి నటించిన నిమ్రత్ కౌర్ మరో వార్త కూడా బయటకు వచ్చింది. అభిషేక్, నిమ్రత్ కౌర్ ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారు. ఐశ్వర్య రాయ్‌తో విడాకుల తర్వాత వారిద్దరూ అధికారికంగా తమ పెళ్లి గురించి ప్రకటిస్తారనే గాసిప్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Abhishek Bachchan reacted on divorce rumours with Aishwarya Rai and Remarriage gossips With Nimrat Kaur in Social media

ఇలాంటి వార్తలు తీవ్రమైన కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయనే నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ ట్విట్టర్‌లో స్పందించారు. నేను విడాకులు తీసుకొంటున్నాననే వార్త నా చెవిన పడింది. ఈ వార్తను నాకు చేరవేసినందుకు థ్యాంక్స్. అలాగే నా రెండో పెళ్లి ఎప్పుడో దయచేసి తెలియజేయండి. ఆ విషయం చెబితే మీకు రుణపడి ఉంటాను అని అభిషేక్ సెటైర్ వేశాడు.

అభిషేక్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను, అలాగే జాతీయ మీడియాలోను వైరల్ అవుతున్నది. దాంతో విడాకులపై వస్తున్న రూమర్లకు పరోక్షంగా చెక్ ప్రయత్నం చేశాడా? అనే టాక్ మీడియాలో వినిపిస్తున్నది. ఇంతకు వారిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయా? విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారా? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నగానే అభిమానులకు మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X