ఆమె అలా నాశనం చేసింది.. తొలిసారి అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వ్యవహారంపై జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వారిద్దరి మధ్య విభేదాలు అంటూ వార్తలు బయటకు పొక్కిన నేపథ్యంలో వారిద్దరూ కూడా మౌనంగా ఉండటంతో అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం పక్కన పెడితే.. తాజాగా కరీనా కపూర్ గురించి ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో రెఫ్యూజీ అనే సినిమా ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశాడు. అతడి సరసన కరీనా కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇద్దరు కూడా లెజెండరీ ఫ్యామిలీ నుంచి రావడంతో వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్, సత్సంబంధాలు బలంగా ఉన్నాయి.

అయితే తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో కరీనా నుంచి ఎదురైన అనుభవాలను ఇటీవల పంచుకొన్నారు. రొమాంటిక్ సీన్ షూట్ చేస్తుండగా.. కరీనా చెప్పిన మాటలు నాకు షాక్ కలిగించాయి. నీవు నాకు బ్రదర్ లాంటి వాడివి. నీతో నేను రొమాన్స్ ఎలా చేయాలి? నీతో ప్రేమలో పడినట్టు ఎలా నటించాలని అనడంతో నాకు ఏం చేయాలో తెలియలేదు అని అభిషేక్ అన్నారు.
ఆ తర్వాత రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు నాకు ఆమె మాటలే గుర్తొచ్చేవి. ఈ సీన్లలో నన్ను, నా యాక్టింగ్‌ను నాశనం పట్టించింది. ఆమె జీవితంలో క్షమించలేని తప్పు చేసి నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది అని అభిషేక్ అన్నాడు.

అయితే అనంతరం అభిషేక్ బచ్చన్‌తో కరీనా సోదరి కరిష్మ కపూర్ ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలు కూడా ఓ దశలో వారిద్దరి పెళ్లి చేయాలని అనుకొన్నారు. కానీ చివరి నిమిషంలో వారిద్దరి మ్యారేజ్‌కు గండిపడింది. అప్పట్లో ఆ పెళ్లి జరగకపోవడానికి కారణం ఐశ్వర్యరాయ్ అనే పేరు బలంగా వినిపించింది.
అయితే ఐశ్వర్య రాయ్ గురించి నాకేం కోపం లేదని కరీనా ఓ సందర్భంలో చెప్పింది. ఐశ్వర్య అంటే నాకు ఇష్టం. చాలా మంచి వ్యక్తి. మా సిస్టర్ పెళ్లికి అడ్డుపడిందనే భావన మాకు లేదు. ఆమె వల్ల మాకు ఏమీ ప్రాబ్లెం అనిపించలేదు అని కరీనా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











