ఐశ్వర్యరాయ్ సంపాదిస్తోంది.... అభిషేక్ బచ్చన్ మీద నీచమైన కామెంట్స్!

By Bojja Kumar

Recommended Video

Abhishek Bachchan Gets Comments From Fans

బాగా సంపాదించే భార్య, సంపాదన లేని భర్త ఉంటే... సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లాం సంపాదించి పెడుతుంటే కూర్చుని తింటున్నాడు, డబ్బు సంపాదన చేతకాదు అంటూ రకరకాలుగా ఎత్తిపొడుస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ టూర్‌కు వెళ్లారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.... మూడేళ్లుగా నువ్వు సినిమాలు చేయడం లేదు కదా? నీ భార్య బిడ్డలను విదేశాల్లో ఎలా తిప్పగలుగుతున్నావు, అంత డబ్బు ఎక్కడిది అంటూ ఎటకారం వ్యాఖ్యలు చేశారు.

అభిషేక్‌కు కించపరచాలనే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు

అభిషేక్‌కు కించపరచాలనే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు

అభిషేక్ బచ్చన్‌ను కావాలని కించ పరిచాలనే ఉద్దేశ్యంతోనే సదరు వ్యక్తి ఈ నీచమైన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన భార్య ఐశ్వర్యరాయ్ పెద్ద స్టార్, వరుస సినిమాలు చేస్తోంది. పెళ్లాం సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్నావంటూ అతడు పరోక్షంగా కామెంట్ చేశాడు.

ఏ మాత్రం కసురుకోకుండా సమాధానం ఇచ్చిన అభిషేక్

ఏ మాత్రం కసురుకోకుండా సమాధానం ఇచ్చిన అభిషేక్

నెటిజన్ కామెంటుపై అభిషేక్ బచ్చన్ ఏ మాత్రం కసురుకోకుండా సమాధానం ఇచ్చాడు. ‘ఎందుకంటే సర్‌.. నేను సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుంటాను. ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాను. వాటిలో క్రీడలు ఒకటి..... కేవలం సినిమాల్లో నటించడం ఒక్కటే నా సంపాదన మార్గం అనుకుంటే అది మీ పొరపాటే' అంటూ ధీటైన సమాధానం ఇచ్చాడు.

అభిషేక్‌కు ఇలాంటివి అలవాటైపోయాయి...

అభిషేక్‌కు ఇలాంటివి అలవాటైపోయాయి...

అభిషేక్ బచ్చన్‌కు ఇలాంటి అవమానాలు, కామెంట్లు కొత్తే కాదు. ఐశ్వర్యరాయ్ లాంటి వరల్డ్ ఫేమస్ స్టార్ భర్తగా మారిన తర్వాత ఆయన ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు. అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్‌కు కొడుకు అయుండి కూడా సినిమాల్లో రాణించలేక పోతున్నాడనే విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. ఇలాంటివి వినీ వినీ అభిషేక్‌కు అలవాటైపోయాయి. వారి కామెంట్లకు కృంగి పోకుండా ధీటుగా సమాధానం ఇవ్వడం నేర్చుకున్నాడు.

సినిమాలు

సినిమాలు

అభిషేక్ బచ్చన్ చివరగా 2016లో వచ్చిన ‘హౌస్‌ఫుల్ 3' మూవీలో కనిపించాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ప్రస్తుతం ‘మన్మర్జియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌, తాప్సి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X